Breaking News

దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేలా విద్యా విధానంలో సమూల మార్పులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అక్షర క్రమంలో మొదటగా ఉన్న మన రాష్ట్రాన్ని అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేలా విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
స్థానిక సత్యనారాయణపురం ఏకెటిపి నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో మంగళవారం పాఠశాలలో 14వ ఆర్థిక సంఘ నిధులతో నిర్మించిన ఆరు తరగతి గదులను ప్రారంభించడంతో పాటు సెట్రల్‌ నియోజకవర్గంలో రూ.33.49 కోట్ల నిధులతో 168 అదనపు తరగతి గదులు, అభివృద్ధి పనులకు మంత్రి బొత్స సత్యనారాయణ శుంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్‌ పాఠశాలకు ధీటుగా రూపొందిస్తున్నామన్నారు. విద్య పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్దతో అక్షర క్రమంలో మొదటగా ఉన్న మన రాష్ట్రాన్ని అక్షరాస్యతలో కేరళ మహారాష్ట్రలతో పోటీపడే విధంగా మొదటి స్థానంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి విద్యపట్ల ప్రత్యేక శ్రద్ద పాధాన్యత నిస్తున్నారని దీనిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలలో ఆధునిక వసతులు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నారు. ప్రతి పాఠశాలలోనూ ప్రహరీ గోడ నుండి త్రాగునీరు, రన్నింగ్‌ వాటర్‌తో మరుగుదొడ్లు తరగతి గదుల్లో ఫర్నిచర్‌తో కూడిన 10 కాంపోనెంట్స్‌ వసతులు తప్పనిసరిగా ఉండేలా నాడు-నేడు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాల మూతపడకుండా నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణం 20 మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లు ఉండేలా ఈ విద్యా సంవత్సరం నుండి అమలు చేస్తున్నామన్నారు. నాడు -నేడు కార్యక్రమం ద్వారా రూ. 4,890 కోట్ల రూపాయలతో పాఠశాలలో మౌలిక వసతులు అదనపు తరగతి గదులు నిర్మాస్తున్నామన్నారు. విద్యార్థులకు ప్రాధమిక దశ నుండే గట్టి పునాది ఉండేలా అంగన్‌వాడి ఆయాలు, స్కూల్‌ టీచర్లు పాఠ్యంశాలు బోధించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి మూడు నుండి ఐదవ తరగతి విద్యార్థులకు ఒక్కొక్క సబ్జెక్టుకు ఐదుగురు టీచర్లను నియమించి ప్రాధమిక దశ నుండి విద్యార్థులకు ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా విద్యతో పునాదివేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. నూతన విద్యా విదానంతో విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులు చేర్పులతో కొంత ఇబ్బందులు ఉంటాయని వీటిని అర్థం చేసుకొని తల్లితండ్రులు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్యను సిబ్బందిని పెంచుతున్నామన్నారు. ప్రతీ మండలానికి రెండు జూనియర్‌ కళాశాలలు, ప్రతీ నియోజకవర్గంలో ఒక డిగ్రీ కళాశాల ఉండేలా ప్రభుత్వం శ్రద్ద తీసుకుంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
సభకు అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు మల్లాధివిష్ణువర్థన్‌ మాట్లాడుతూ సెంట్రల్‌ నియోజకవర్గంలో దాదాపు 33 కోట్ల రూపాయలతో 160కి పైగా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. మూడు సంవత్సరాల కాలంలోనే నియోజకవర్గంలో సుమారు 236 కోట్ల రూపాయల నిధులను విద్యకు ఖర్చు చేశామన్నారు. నియోజకవర్గంలో జగనన్న విద్యా దీవన, అమ్మఒడి, విద్యాకానుక తదితర పథకాలకు 25 వేల మంది లబ్దిదారులకు 112 కోట్ల రూపాయలు వారి ఖాతాలకు జమ చేశామని శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్‌ అన్నారు.
నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నాడు-నేడు కార్యక్రమం ద్వారా నగర పాలక సంస్థ పరిధిలోని 90 పాఠశాలల్లో 112 కోట్ల రూపాయలు నిధులను ఖర్చు చేశామన్నారు. భవిష్యత్‌లో విద్యార్థులు ఉన్నత చదువులు చదువులు చదివి అంతర్జాతీయ స్థాయి విద్యార్థులతో పోటీపడే విధంగా ఎల్కేజీ నుండి ఇంగ్లీష్‌ మీడియం బోధన అందిస్తున్నామన్నారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువని నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని మేయర్‌ అన్నారు.
జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో మనబడి నాడు-నేడు కార్యక్రమం ద్వారా మూడు దశలలో పాఠశాలలో మౌలిక వసతులు, అదనపు తరగతి గదులు నిర్మాణాలు పూర్తి చేస్తున్నామన్నారు. మొదటి దశలో రూ.78.33 కోట్ల రూపాయల నిధులతో 325 పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేశామన్నారు. రెండవ దశలో 465 పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు 898 అదనపు తరగతి గదులకు రూ. 213 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ పైబర్‌ నెట్‌ చైర్మన్‌ పి.గౌతమిరెడ్డి డిప్యూటీ మేయర్‌ అవుతు శ్రీ శైలజా రెడ్డి, డీఇఓ సివి రేణుక, సెంట్రల్‌ నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *