Breaking News

రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్ బాక్సును కట్టుద్దిమైన భద్రతతో డిల్లీకి పంపిన అధికారులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాష్ట్రపతి ఎన్నికకు సోమవారం రాష్ట్రంలో జరిగిన పోలింగ్ లో శాసన సభ్యులు వేసిన ఓట్లతో భద్రపర్చిన బ్యాలెట్ బాక్సును కట్టుద్దిమైన భద్రత నడుమ మంగళవారం ఉదయం అధికారులు డిల్లీకి పంపారు. శాసన సభా ప్రాంగణంలోని స్ట్రాంగ్ రూమ్ ను ఎన్నికల పరిశీలకులు చంద్రేకర్ భారతి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కె. రాజ్ కుమార్ మరియు అధికార పార్టీ పోలింగ్ ఏజంట్ గా వ్యవహరించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాద్ సమక్షంలో మంగళవారం ఉదయం అధికారులు తెరిచి సీల్డు బ్యాలెట్ బాక్సును బయటకు తీశారు. తదుపరి రాష్ట్ర అసెంబ్లీ చీఫ్ మార్షల్ థియో ఫిలాస్ నేతృత్వంలో పటిష్టమైన పోలీస్ భద్రత మధ్య అధికారులు గన్నవరం విమానాశ్రయానికి ఆ సీల్డు బ్యాలెట్ బాక్సును ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్లారు. అక్కడ నుండి ఉదయం ఎయిర్ ఇండియా విమానంలో డిల్లీలోని పార్లమెంట్ భవనానికి ఆ సీల్డు బ్యాలెట్ బాక్సును అప్పగించేందుకు ఎన్నికల పరిశీలకులు చంద్రేకర్ భారతితో పాటు రాష్ట్రపతి ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు కె.రాజ్ కుమార్, వనితారాణి తదితరులు వెళ్లారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, డిప్యుటీ సి.ఇ.ఓ. వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ సి.ఇ.ఓ. జె.వి.శ్రీనివాసశాస్త్రి తదితరులు గన్నవరం విమానాశ్రయం వరకూ ఈ సీల్డు బ్యాలెట్ బాక్సు వెంటన వెళ్లారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *