-సిజిజిబి చీఫ్ మేనేజర్ నాగేశ్వరరావు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు డిపాజిట్లపై అత్యధిక వడ్డీ చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వ రంగ బ్యాంకు గా చరిత్రకెక్కిందని ఆ బ్యాంకు గోరంట్ల శాఖ చీఫ్ మేనేజర్ చిలక నాగేశ్వరరావు అన్నారు. దాదాపు 250 ఫ్లాట్స్ తో కూడిన శివా గ్రీన్ వ్యాలీలో బ్యాంకు అధికారులు, సిబ్బంది రెండు రోజులపాటు తమ బ్యాంకు పథకాలపై విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒకటి నుండి రెండు సంవత్సరాల లోపు డిపాజిట్లు 6.30 శాతం సీనియర్ సిటిజన్స్ కు 6.80 శాతం వడ్డీ చెల్లిస్తున్నామని అన్నారు. ఇక బంగారంపై ఒక గ్రామ కు 3600 వరకు ఉద్యోగస్తులకు 9.75% వడ్డీ పై రూ. 50 లక్షల వరకు (120 నెలల కాల పరిమితి). ఆస్తి తనఖా పై 15 ఏళ్ల కాలపరిమితి పై ఐదు కోట్ల వరకు రుణం అందజేస్తామన్నారు. ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇలా మరెన్నో పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ కాలనీవాసి, టెలికాం సలహా కమిటీ గుంటూరు జిల్లా సభ్యులు నిమ్మరాజు చలపతిరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బ్యాంకు తరపున సీనియర్ మేనేజర్ పి అమర్నాథ్ రెడ్డి, ఆఫీసర్ వై ఆర్ మధు క్యాషియర్, కె వెంకటలక్ష్మి సబార్డినేట్ కె నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News