విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం లో అమలవుతున్న ఇంగ్లీష్ మీడియం విధి విధానాలు అధ్యయనం చేసేందుకు ఉత్తర ప్రదేశ్ నుంచి బృందం 3 రోజులపాటు రాష్ట్రం లో పర్యటిస్తుందని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాప్ రెడ్డి గారు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ లోని ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ శుక్ల, కుల్దీప్ పాండే మొదటి రోజు పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఈడుపుగల్లు ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల , నిడమానూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించారని తెలిపారు. విద్యార్థుల ఉచ్చారణ, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అనుసరిస్తున్న ఇంగ్లీష్ మీడియం బోధన విధానాలు, ద్వి భాషా పుస్తకాలు , వృత్యంతర శిక్షణా కార్యక్రమాలను పరిశీలించారని పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియం బోధన లో మెళుకువలను అడిగి తెలుసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ స్కంద్ శుక్లా ప్రిన్సిపాల్, కుల్ దీప్ పాండే లెక్చరర్,ELIT ప్రయగ్ ఉత్తర్ ప్రదేశ్, సరికొండ.సతీష్ లెక్చరర్, SCERTAP ,HM లు దుర్గాభవాని, సురేష్, పద్మ బాయి, పెనమలూరు meo కనక మహా లక్ష్మి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News