భూగర్భ జలాలు స్థాయి జిల్లా జనాభా కి అనుగుణంగా పెంచుకునే ప్రయత్నం చేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో అమలు చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఉద్యోగ కల్పనలో ఒక రెవల్యూషన్ గా కేంద్ర జల శక్తి అభియాన్ నోడల్ అధికారి ఎస్. ప్రవీణ్ పేర్కొన్నారు. బుధవారం వారం స్థానిక కలెక్టర్  కార్యాలయ సమావేశ మందిరంలో  డ్వామా, వ్యవసాయ, హార్టికల్చర్, భూగర్భ జల, జలవనరుల, అటవీ, జిల్లా పంచాయతీ, మైక్రో ఇరిగేషన్, రూరల్ వాటర్ సరఫరా తదితర శాఖల అధికారులతో  కేంద్ర జల శక్తి అభియాన్ నోడల్ అధికారి ఎస్. ప్రవీణ్ , కలెక్టర్ సమక్షంలో వర్షం నీరు ఒడిసి పట్టుకొవడం 2022 యాక్షన్ ప్లాన్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి ఎస్. ప్రవీణ్ మాట్లాడుతూ, జిల్లా పరిధిలో వర్షా కాలం ముందు, తరువాత భూగర్భ జలాలు స్థాయి ఆధారంగా నీటి వనరులు సంరక్షణ కోసం ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక అమలు, తద్వారా జల జీవన్ మిషన్, జల శక్తి అభియాన్ ద్వారా పురోగతి పై సమగ్ర నివేదికను అందించాలన్నారు. రాష్ట్రంలో సమర్థవంతంగా మానవ వనరుల అందుబాటులో ఉండడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే పథకాలు అమలు సమర్థవంతంగా అమలు సాధ్యం అవుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్క వాన బొట్టు ను ఒడిసి పట్టుకొని భూగర్భ జలాలు స్థాయి జిల్లా జనాభా కి అనుగుణంగా పెంచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు.

జల వనరుల సంరక్షణ కార్యక్రమాలను గతంలో ప్రభుత్వ బాధ్యత గా ప్రజలు భావించే వారని, ప్రస్తుతం ప్రజలు కూడా స్వచ్ఛధంగా ఇందులో భాగస్వామ్యం అవుతున్నారని కలెక్టర్ డా కె.మాధవీలత వివరించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అవెన్యూ ప్లానిటేషన్ దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో ప్రస్తుతం రూ 217 సగటు వేతనం ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో ₹.247 దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా మైక్రో ఇరిగేషన్ ద్వారా నీటి వనరులు సంరక్షణ కోసం డ్రిప్, స్పింక్లనర్ ను ప్రోత్సహించడం జరుగుతోందని 2022-23 వార్షిక ప్రణాళిక లో 3,800 హెక్టార్ల లో చేపట్టి, ఇప్పటి వరకూ 3500 హెక్టర్ల లో అర్భికే లు ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేశామన్నారు. గ్రామీణ నీటి సరఫరా సంస్థ జిల్లాలో జగనన్న కాలనీల్లో 765 యూనిట్స్ కు గానూ 207 పనులు పూర్తి చేశామన్నారు. జిల్లా గ్రామీణ నీటి సరఫరా ద్వారా 413 పనులకు గాను 87 పనులు పూర్తి అయి, 127 పురోగతి లో ఉన్నట్లు తెలిపారు. జల జీవన్ మిషన్ కి ముందు 30 శాతం ఇళ్లకి త్రాగునీరు సరఫరా చేస్తే, తదుపరి 70 శాతం ఇళ్లకు త్రాగునీటి అందించ గలుగుతున్నా మన్నారు. భూగర్భ జలాలు స్థాయి ని పెంచుకునే దిశలో సంప్రదాయ పద్ధతులతో పాటు సాంకేతిక పరిజ్ఞానం అమలు చేస్తున్నామన్నారు. ఫిజీయో మీటర్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తూ, శాటిలైట్ వ్యవస్థ ను సద్వినియోగం చేసుకుంటున్నామన్నారు.ఉపాధిహామీ పథకం అమలు, గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా అవగాహన కార్యక్రమాలు, అమృత్ సరోవర్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో కొనసాగుతున్న చెరువుల అభివృద్ది పై, జగనన్న స్వచ్ఛ సంకల్ప – సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర సమాచారాన్ని వివరించారు. వర్షా కాలం ముందు, తరువాత భూగర్భ జలాలు స్థాయి ఆధారంగా నీటి వనరులు సంరక్షణ కోసం ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్న వాటిపై సమగ్రంగా సమాచారాన్ని వివరించారు.

ఈ సమావేశంలో డ్వామా పీడీ జీ ఎస్. రామ్ గోపాల్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు,  ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ ఈ డి. బాలశంకర్, గ్రౌండ్ వాటర్ డి డి ఎ. శ్రీనివాస్, డి పి ఓ పి. జగదాంబ, జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి ఎస్. రామ్ మోహన్, సిపివో కే. ప్రకాశరావు , ఇరిగేషన్ ఏ ఈ .. ఏ. శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *