రాజమహేంద్రరం, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలోని ప్రభుత్వం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల దిశలో రహాదారుల ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సును ఆవిష్కరించడానికి ఆపనులు పూర్తి చేసి జాతకి అంకితం చేయబడుతుందని కేంద్ర రోడ్డు రవాణ మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో గురువారం కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 8 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా), ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోష్, మార్గాని భరత్ రామ్, వంగా గీత అనురాధ, పలువురు శాసన సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సీనియర్ అధికారుల పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాజమహేంధ్రవరం లో జాతీయ రహాదారుల అభివృద్ది లో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబందించిన 3 వేల కోట్ల విలువైన 8 ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేసిన సాధ్యమైనంత త్వరలో నే వాటిని జాతికి అంకితం చేస్తామన్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడుతూ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత వాటి ఫలాలు వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ రహదారులు పూర్తయితే కాకినాడ సెజ్ పోర్ట్, ఫిషింగ్ హార్బర్ మరియు కాకినాడ యాంకరేజ్ పోర్టులకు, గ్రీన్ ఫీల్డ్ రోడ్ కనెక్టివిటీని అందజేస్తాయని, దీనివల్ల బియ్యం, సీ ఫుడ్, ఆయిల్ మీల్స్, ఐరన్-ఎగుమతులు సాఫీగా జరుగుతాయన్నారు. కాకినాడ పోర్టు ద్వారా ఖనిజం, జీవ ఇంధనం, గ్రానైట్ మొదలైనవి ఎంతో సులభతరంగా రవాణా సాధ్యమవుతుందన్నారు. కైకరం, మోరంపూడి, ఉండ్రాజవరం, తేతలి, జొన్నాడ వద్ద 5 ఫ్లైఓవర్లను నిర్మించనున్నామని, అవి పూర్తయిన తర్వాత నామవరం, శాటిలైట్ సిటీ, మండపేట, రామచంద్రపురం, కాకినాడ, వంటి ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సురక్షితమైన రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. ఉండ్రాజవరం, నిడదవోలు, తణుకు టౌన్,కైకరం. బ్లాక్స్పాట్లను సరిదిద్దడానికి ప్రత్యేక భద్రతా ఫీచర్లు అనుగుణంగా ఈ రహదారుల నిర్మాణం ఉంటుందన్నారు. వాకలపూడి-ఉప్పాడ-అన్నవరం – సామర్లకోట-అచ్చంపేట జంక్షన్ నాలుగు లైన్ల రహదారి, రంపచోడవరం నుండి కొయ్యూరు వరకు పక్కాగా ఉన్న భుజాలతో రెండు లైన్ల నిర్మాణంతో సహా ఇతర మూడు ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. సామర్లకోట, అన్నవరం బిక్కవోలు, ర్యాలి – పిఠాపురం వంటి ఆద్యాత్మిక ప్రదేశాలకు రహదారి అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు.
పర్యాటక ప్రాంతాలైన అరకు, లంబసింగి వంటి గిరిజన ప్రాంతాలకు, అరకు లోయ, బుర్రా గుహలు వంటి ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలకు రహదారి సౌకర్యం సాకారం కానున్నదన్నారు. కాకినాడ, అల్లూరి సీతారామ జిల్లాల ద్వారా సురక్షితమైన, మెరుగైన మరియు వేగవంతమైన అంతర్రాష్ట రహదారుల అనుసందానం వలన సాధ్యమవుతుందని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతానికి రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఇక్కడి ప్రజలు తెలిపిన ఆత్మీయతకు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ కేంద్ర మంత్రి గడ్కారి విన్నూత్నమైన ఆలోచనతోనే దేశంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారన్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రక్క సంక్షేమ పథకాలను అమలు చేస్తునే మరో వైపు అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నా రన్నారు. రహదారులను అభివృద్దిలో భాగంగా రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులకు అనుసంధానం చేసి సరుకు రవాణా విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. ప్రతి నెల రాష్ఠ్ర అధికారులతో సమక్షలు చేస్తున్నారని ప్రత్యేక పోర్టల్ ను ఏర్పాటు చేసి భూసేరణ పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నా రన్నారు. అటవీ భూముల క్లీయరెన్సు కు సంబందించి పర్యావరణ పరిరక్షణతోపాటు అభివృద్దికి సమాన ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వంతో కలసి రాష్ట్రంల రూ.7640 కోట్ల తో పలు పనలు చేపట్టామన్నారు. 2022-23 సంవత్సరంలో రు.12 వేల కోట్లతో పనులు చేపట్టే దిశలో కేంద్ర ఆమోదించడం పట్ల మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో చేపట్టాల్సిన పలు రహదారుల అభివృద్దికి సంబందించి కేంద్ర మంత్రి గడ్కారి ముందు పలు ప్రతిపాధనలు చేశారు. వీటిలో విశాఖ పట్నం – బోగాపురం, రుసికొండ తదితర ప్రాజెక్టు పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గత ఏడాది 490 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులత అనుసంధానం చేయడం జరిగిందని, ఈ ఏడాది 397 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులకు అనుసందానం చేసే దిశగా అడు వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 3 వేల కిలోమీటర్ల ఇండస్ట్రియల్, అగ్రికల్చర్, టూరిజం లకు సంబందించి జోన్ లకు అనుసంధానంగా ఉండే రహాదారు పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నా మన్నారు. మీ ఆలోచనలకు అనుగుణంగానే రాష్ట్రంలో కూడ రహదారుల అభివృద్ది దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.
పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ రాజమహేంద్రవరానికి వచ్చి ఉభయ గోదావరి జిల్లా కు సంబంధించిన 8 ప్రాజెక్టు పనులు శంఖుస్తాపనకు రావడం పట్ల ఇక్కడి ప్రజలు తరపున కేంద్రమంత్రి నితిన్ గడ్కారి కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మన్నారు. రాజమహేంద్రవరం నగరం ఎంతో చారిత్రాత్మకమైన ఆద్యాత్మిక సాంస్కృతిక వారసత్వం కలిగిన నగరమన్నారు. ఇక్కడ ప్రవహించే గోదావరి నదీ తీరాన్న దక్షిణ కాశీగా పేర్కొంటారని, ఉత్తర భారత దేశంల ఉంటే వారణాశి ఉత్తర కాశీ అంత పవిత్రత కలిగిన ప్రదేశం అన్నారు. రహదారుల నిర్మాణం ద్వారా ఈ ప్రాంతం ఎంతో ఆర్థికంగా పురోగతి దిశలో నడుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెటులకు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ఇక్కడి ప్రజల కలను సాకారం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ్యులు పిల్లి శుభాష్ చంద్రబోస్, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్, కాకినాడ ఎంపీ వంగా గీత, అమలాపురం ఎంపీ చింతాఅనురాధ, అరకు ఎంపీ జి. మాధవి, శాసన సభ్యులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి, జక్కంపూడి రాజా, తలారి వెంకటరావు, సత్తి సూర్యనారాయణ రెడ్డి, జి. శ్రీనివాస నాయుడు,డీసీసీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రుడా చైర్ పర్శన్ మేడపాటి షర్మిలా రెడ్డి, జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత, మున్సిపల్ కమీషన్ కె. దినేష్ కుమార్ రూరల్ ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, బీజేపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, జిల్లా పరిషత్ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా సభా ప్రాంగణంలోకి చేరుకున్న కేంద్రమమంత్రికి పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అదే ప్రాంగణంలో రాష్ట్రంలో అభివృద్ది పరిచిన జాతీయ రహాదారుల పై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. ఇందులో భాగంగా పది మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్ళను కేంద్ర మంత్రి అందజేశార. తదుపరి సభా వేధికకు చేరుకొని జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం రాష్ట్రంలో చేపడుతున్న 8 జాతీయ రహదారి పనులకు వర్చువల్ విధానంలో శంఖుస్థాపన చేసారు.
Prajavartha Online Telugu News