Breaking News

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిరుపేదలకు ప్రత్యేక సదుపాయాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
మహాత్మా గాంధీ 153వ జయంతి పురస్కరించుకొని పేద వర్గాలు రైతులు, డ్వాక్రా మహిళలు, ఇతర చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాస్తులకు చేయూతనిచ్చే వివిధ రకాల పథకాలను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలు చేసింది. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు విజయవాడ జోన్ పరిధిలో గల అన్ని శాఖలలో ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఫీల్డ్ జనరల్ మేనేజర్ పర్యవేక్షణలో వీటిని అమలు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 2250 ప్రధానమంత్రి ముద్ర యోజన ఖాతాలను పేద లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. దీనితోపాటు 5334 డ్వాక్రా గ్రూపులకు రూ.23.31 కోట్ల కొత్త రుణాలను కూడా మంజూరు చేశారు. రైతు రుణ విముక్తి అను ప్రత్యేక పథకం ద్వారా దాదాపు 45 కోట్ల రూపాయలను రైతులకు రుణ సదుపాయం కలిగించే వారిని వడ్డీ వ్యాపారస్తుల నుంచి విముక్తి కలిగించారు. దీనితోపాటు 7750 రైతులకు కెసిసి రుణ సదుపాయం కల్పించారు. 4234 మందికి కొత్తగా ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా ఆర్థిక చేయూతకు తోడ్పాడు అందించేలా 29.25 కోట్ల రుణాలను మంజూరు చేశారు. అలాగే ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఆరు పాఠశాలలో మరియు 25 నివాస గృహాలలో మరుగు దొడ్ల నిర్మాణాలకు బ్యాంకు ఆర్థిక చేయూతనిచ్చింది. అలాగే యూనియన్ బ్యాంక్ విజయవాడ జోన్ పరిధిలో పదహైదు వృద్ధాప్య అనాధ సెంటర్లలో నిత్యావసర వస్తు పంపిణీ చేపట్టారు. అలాగే అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు నవనీత్ కుమార్, ఫీల్డ్ జనరల్ మేనేజర్ మరియు ఎస్ ఎల్ బి సి కన్వీనర్ మరియు వారి సిబ్బంది స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నవనీత్ కుమార్ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. దీనిలో బ్యాంకు డి జి ఎం ఎస్ పీవీజే నరసింహ మూర్తి, ఎం శ్రీనివాసరావు, ఏజీఎం ఆర్.అనిత మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎల్‌బీఆర్‌సీఈలో పాఠశాలలు మరియు కళాశాల విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రవాణా శాఖ వారి అధ్యర్యంలో విద్యాసంస్థల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *