విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ అమ్మవారిని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు, తల్లి ఎస్ పార్వతి,సతీమణి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, కుమారుడు జివితేష్, కుమార్తె సిరి చందన లతో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ఈవో డి భ్రమరాంబ జిల్లా కలెక్టర్ యస్ ఢిల్లీ రావు కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. అంతరాయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం పలికి అమ్మవారి చిత్రపటాన్ని, శేష వస్త్రాన్ని, ప్రసాదాలను అందజేశారు.
Prajavartha Online Telugu News