Breaking News

బొత్సా సత్యనారాయణ అమరావతి ఉద్యమం చేస్తున్న ప్రజలకు క్షేమాపణ చెప్పాలి : కొట్టేటి హనుమంతరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో సోమవారం జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో మాజీ ఫ్లోర్ లీడర్ పార్లమెంట్ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాన్ని అడ్డుకోవడం నీతరం కాదు , నీకు దమ్ము దైర్యం ఉంటే అడ్డుకో.. శ్రీలంకలో మంత్రులకు అక్కడ ఉద్యమానికి వ్యతిరేకంగా వెళ్లినందుకు నడిరోడ్డుపై బట్టలు ఊడతీసి తరిమి కొట్టిన సంఘటనే మీకు పట్టిది. నీలాంటి వాడు విద్య మంత్రిగా ఉండటం మన రాష్ట్రం చేసుకున్న దౌర్బాగ్యం. నువ్వు తెలుగు మాట్లాడటం నేర్చుకో.. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. నీవు ప్రజలను అవమాన పరిచేలా మాట్లాడుతున్నావు, ప్రజలే తగ్గినా గుణపాఠం చెప్తారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తరవాత అన్ని రంగాలలో అభివృద్ధి సర్వనాశనం అయ్యింది అని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప మీ ప్రభుత్వంలో మరెప్పుడైనా ఎక్కడైనా అభివృద్ధి జరిగింది అని చెప్పగలవా అని బొత్సాని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికలలో ఓటమి పాలవుతారని గ్రహించి మీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గడప గడప యాత్రకి వెళ్లాలని సూచించినా, ప్రజలు మిమల్ని ఆదరించే పరిస్థితి లేదు అన్నారు. 2024 లో జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలు ప్రజలు పట్టం కట్టపోతున్నారని ఈ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలన్నా, ఈ రాష్ట్రానికి అమరావతే రాజధాని గా ఉండాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యం అయ్యిది అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గ్రహించారు. బొత్సా సత్యనారాయణ ఇతర మంత్రులు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, లేకుంటే ప్రజలే మీకు తగిన బుద్ది చెప్తారని, మీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు ప్రజలు తప్పు చేసామని భావనలో ఉన్నారు . మీకు మళ్ళీ అధికారం ఇచ్చే అవకాశం లేదు అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు 35వ డివిజన్ అధ్యక్షరాలు బూద్దాల నంద కుమారి , సీనియర్ మైనారిటీ నాయకులు షేక్ కరీముల్లా, SC నాయకులు తుపాకుల వెంకటేశ్వర్లు, 61వ డివిజన్ మహిళా అధ్యక్షురాలు D శివ కుమారి తదితరాలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాలు.. ఈదురు గాలులు.. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి

-ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి -ఉత్తరాంధ్రకు ఎస్పీడీసీఎల్ నుంచి అదనపు సిబ్బంది -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *