
-విజయవాడ లో డీజే టిల్లు మూవీ హీరోయిన్ సందడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో డీజే టిల్లు మూవీ హీరోయిన్ నేహా శెట్టి సందడి చేసింది.ఆదివారం బందర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీవత్స మెగా షాపింగ్ మాల్ ని నేహ శెట్టి ,నగర మేయర్ భాగ్యలక్ష్మి తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ మాల్ నీ డీజే టిల్లు మూవీ హీరోయిన్ నేహా శెట్టి, మేయర్ భాగ్యలక్ష్మి తో కలిసి ప్రారంభించారు. షోరూమ్ లో ఏర్పాటుచేసిన వివిధ రకాల శారీస్ లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూ మహిళా మణుల కోసం ప్రత్యేకంగా శ్రీవత్స షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. పట్టు చీరలు ఎంతో బాగున్నాయని మహిళలకు ఎంతగానో నచ్చే విధంగా ఉన్నాయని ఆమె తెలియజేశారు. తనకు చిన్నప్పుడు వెస్ట్రన్ డ్రెస్సులు అంటే ఎంతో ఇష్టమని ప్రస్తుతం చీరలు ధరించడం ఫ్యాషన్ గా మారిందని చెప్పారు. శ్రీవత్స షో రూమ్ లో మగువలకు ఇష్టమైన అన్ని రకాల చీరలు అందరికీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నానని త్వరలో రిలీజ్ కానున్నాయనీ, వెబ్ సిరీస్ లో అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తానని పేర్కొన్నారు. టాలీవుడ్ లో అందరు హీరోలు అంటే ఇష్టమే అని ప్రత్యేకంగా డ్రీమ్ రోల్ అంటూ ఏదీ లేదని ఆమె తెలియజేశారు.అనంతరం మేయర్ భాగ్యలక్ష్మి మాట్లడుతూ ఆధునిక డిజైన్ల చీరలను మహిళలు ఇష్టపడతారని అలాంటి వారి కోసం శ్రీవత్స షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయం అని పేర్కొన్నారు.
తదనంతరం షోరూం రీజినల్ మేనేజర్లు పాలని నవీన్ కుమార్, బొమ్మిడి పవన్ కుమార్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో మొట్టమొదటిగా సారిగా శ్రీవత్స షోరూం ఏర్పాటు చేశామని తెలిపారు. మగువల మనసు దోచుకునే విధంగా కంచి ఆరని ధర్మవరం పోచంపల్లి పట్టు చీరలు తమ షోరూమ్ లో లభిస్తాయని చెప్పారు. పట్టు చీరలు తో పాటు డిజైనరీ శారీస్, ఫ్యాన్సీ సారీస్, లెహంగాస్ అందుబాటులో ఉన్నాయన్నారు. అందరికీ అందుబాటు ధరల్లో చీరలు లభిస్తాయని ఈ అవకాశాన్ని మహిళా మణులు సద్వినియోగం వారు కోరారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News