విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలములో మహర్షి వాల్మీకి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్., ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు,వి.ఎం.సి.,అధికారులు మరియు సిబ్భంది పాల్గొనారు . నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్. మరియు ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వo ఉత్తర్వుల ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలములో రామాయనమును మాధుర కావ్యంగా మలిచి మానవజాతికి సన్మార్గాన్ని ఉద్దేశించిన మహానీయుడు, ఆదికవి వాల్మీకి మహర్షి రామాయణాన్ని ప్రతి ఒక్కరు అనుసరించి గొప్పగా ఎదగాలని తెలిపారు వాల్మీకి బోధనలు ద్వార ప్రతి ఒక్కరు సన్మార్గంని మరియు ధర్మాన్ని తీసుకోవాలని వివరించారు. వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి గౌరవించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ రిలేషన్స్ అధికారి i/c, ప్రాజెక్ట్ ఆఫీసర్ యు.సి.డి శకుంతల ,డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) కుమారి డి వెంకట లక్ష్మి,మేనేజర్ బి.శ్రీనివాస్ రావు , మరియు వి.ఎం.సి.అధికారులు ,సిబ్భంది పాల్గొనారు.
Prajavartha Online Telugu News