Breaking News

సోము వీర్రాజు వ్యాఖ్యలు అర్థరహితం : డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

తాడేపల్లి గూడెం, నేటి పత్రిక ప్రజావార్త :
దేవాదాయ భూములను అన్యాక్రాంతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడానికి ఎప్పుడూ మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చేయాల్సినవన్నీ చేస్తున్నామని సోమ వీర్రాజు వాఖ్యలు తగదని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఈరోజు తాడేపల్లిగూడెం పార్టీ క్యాంప్ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ భద్రాచలం శ్రీరామచంద్రమూర్తికి దేవాలయానికి 18వ శతాబ్దంలో శ్రీరామ మూర్తి అనే దాత దేవాలయానికి 912 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. ఆ భూమి అన్యాక్రాతానికి గురైందని సోము వీర్రాజు విమర్శ చేయడం ఆయన అవగాహన రాహిత్యాన్ని తెలియజేస్తుంద ని మంత్రి అన్నారు. ఆ భూమిని చాలా కాలం నుంచి కొందరు కౌలు రైతులు ఆ భూమిని కౌలు చెల్లిస్తూ సాగు చేసుకుంటున్నారన్నారు. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఒసీ, మైనారిటీ, క్రిస్టియన్ రైతులు కూడా ఉన్నారు. ఏపీ ప్రభుత్వం దేవాదాయ భూములను క్రిస్టియన్ చర్చిలకు ఇస్తున్నారని సోము వీర్రాజు ఎద్దేవా చేయడం సబబు కాదని మంత్రి అన్నారు. దాని మీద వస్తున్న వార్తలకు నేను స్పందించి మా దేవదాయ శాఖ కమిషనర్, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ కి ఫోన్ చేసి భద్రాచల దేవాలయ భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయని వార్తలు వస్తున్నాయి, ఎంక్వయిరీ చేసి దాని మీద ఒక నివేదిక ఇవ్వాలని కోరాను. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఒక కమిటీ వేసి అక్కడ ఎటువంటి దేవాదాయ భూములు కబ్జా కాలేదని ఒక నివేదిక ఇచ్చారు. ఒక ఎంపీటీసీ ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఒక ఇల్లును కట్టుకున్నాడు, దాన్ని కూడా ఖాళీ చేయించామని కలెక్టర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో భద్రాచలం దేవాలయానికి సంబంధించిన భూములు ఎటువంటి అన్యాక్రాంతానికి గురి కాలేదని పూర్తి స్థాయిలో ఎంక్వయిరీ చేసి కలెక్టర్ ఒక నివేదిక రూపంలో ఇచ్చారు. దానిని తెలంగాణ దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ఫోన్ చేసి చెప్పాను. ఆయన కూడా సానుకూలంగా స్పందించి భద్రాచలం దేవాలయం ఈఓ ను పంపిస్తాను, ఆ భూములను వేలం వేసి ఆ మొత్తాన్ని భద్రాచలం రామచంద్ర మూర్తి దేవాలయానికి పంపించాలని ఆయన కోరారు. సోము వీర్రాజు నిజాలు తెలుసుకుని మాట్లాడాలని, అబద్దాలతో సీఎంకు ఉత్తరాలు రాయడం కరెక్ట్ కాదని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాలయాల మీద సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి పరిష్కరించి తీరుతాం అని మంత్రి చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *