ఉక్కు కాకాని 50 వర్ధంతి వేడుకలు…

హనుమాన్ జంక్షన్, నేటి పత్రిక ప్రజావార్త :
వాటి తరహా రాజకీయాలు నేడు మళ్ళీ రావాలని వాటి సాధనకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కాకాని ఆశయ సమితి అధ్యక్షులు తరుణ్ కాకాని అన్నారు. ఆదివారం హనుమాన్ జంక్షన్ కాకాని కళ్యాణ మండపంలో ఉక్కు కాకాని 50 వర్ధంతి వేడుకలను కాకాని ఆశయ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు తరుణ్ కాకాని అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ నేడు స్వచ్ఛత లేని రాజకీయాల్లో ముందుకు సాగుతున్నామని, రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అద్దంకి మాజీ శాసనసభ్యులు బాచిన చెంచు గరటయ్య మాట్లాడుతూ ఉక్కు కాకాని మరణించి 50 సంవత్సరాల అయినప్పటికీ నేటికీ ఆ నాయకుడ్ని ప్రజలు మరిచిపోలేదన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం మాట్లాడుతూ ఉక్కుకాకాని రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకున్నారని చిరస్మరణీయుడుగా చరిత్రలో నిలిచి ఉన్నారని అన్నారు. ముందుగా కళ్యాణ మండపం ఆవరణలో ఉన్న నిలువెత్తు కాకాని విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం కాకాని చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఫౌండర్ ట్రస్టి కాకాని వెంకటేశ్వరరావు (బాబు ), రాష్ట్ర సాగునీటి సంఘాల అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు, మాజీ జడ్పిటిసి సభ్యులు సుంకర సుభాష్ చంద్రబోస్, జనసేన నాయకులు చలమలశెట్టి రమేష్ బాబు, తెలుగుదేశం నాయకులు తుమ్మల జగన్, మర్రిబంధం రైతు అధ్యక్షులు కన్నిగంటి శ్రీనివాసరావు, సగ్గూరు మిల్క్ సొసైటీ ప్రెసిడెంట్ పుసులూరి నాగమణి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *