Breaking News

అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఐసిడియస్ ప్రాజెక్టు, కొవ్వూరు పరిధిలో ఖాళీగా వున్న రెండు అంగన్వాడీ కార్యకర్తల , ఆరు అంగన్వాడీ సహాయకుల పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీచేయడమైనదని సమగ్ర శిశు సేవ అభివృద్ధి అధికారి మమ్మీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నందమూరు -2 , అరికరేవుల -3 కేంద్రం లో అంగన్వాడీ కార్యకర్తల రెండు పోస్టులు, అంగన్వాడీ సహాయక 6 పోస్టు లు అశోక్ పబ్లిక్ స్కూల్ (వార్డ్.14), దొమ్మెరు -4, ఉటలంక కాకుండా (8వ వార్డు) , 2వ వార్డు పార్కు వద్ద, బంగారం పేట, వాడపల్లి -3 కేంద్రాలలో  భర్తీ చేయడం జరుగుతుందన్నారు. ఈ పోస్టులు భర్తీకి సంబంధించి అర్హత కలిగిన అభ్యర్థులు 3.1.2023 సాయంత్రం 5 గంటల లోగా ధరఖస్తూ చేసుకోవలసినదిగా వారు ఆ ప్రకటనలో కోరారు. 10 వ తరగతి ఉత్తీర్ణత, (అదనపు విద్యా అర్హతలకు ప్రాధాన్యత ఇవ్వడం జరగదు) స్థానికత కలిగి ఉన్న విహాహం అయిన మహిళలు అర్హులు. 1.7.2022 నాటికి వయస్సు 21 సం. ములు నిండి 35 సం.ముల లోపు ఉండాలి. దివ్యాంగులకు సంబంధించి అతి తక్కువ వైకల్యం ఉన్న వారు తమ విధులు తాము నిర్వర్తించే వారిని పరిగణన లోకి తీసుకోవడం జరుగుతుంది. తదుపరి వివరములు కొరకు సి.డి.పి.ఓ, ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్, కొవ్వూరు వారిని ఆఫీస్ పని దినములలో జనవరి 3 వ తేదీ వరకు ఉదయం 10గం.ల నుండి సాయంత్రము 5. గం.ల వరకు సంప్రదించవచ్చునని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను జనవరి నెల 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కొవ్వూరు వారి కార్యాలయంములో స్వీకరించడం జరుగుతుందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హంద్రీనీవా జలాలకు సీఎం జల హారతి

-కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద ప్రత్యేక పూజలు -బీరగానిపల్లె రిజర్వాయర్ శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *