తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త :
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ నేతాజీ నగర్ లో సోమవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి కొట్టు సత్యనారాయణ తొలుత నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ భారతీయుడు సత్తాను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ధీరోదాత్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. దేశ స్వాతంత్రం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి విరోచితంగా పోరాడిన పోరాటయోధుడు అన్నారు. దేశ స్వతంత్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన త్యాగమూర్తులను స్మరించుకోవడం కనీస ధర్మం అన్నారు. జాతీయ ఉద్యమ నేతలను సైతం కొన్ని పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని అనుకోవడం స్వార్థ రాజకీయాలకు పరాకాష్ట అని ఆవేదన వ్యక్తం చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మహాత్మా గాంధీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుని దేశం కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలని మంత్రి కొట్టు సత్యనారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీమన్నారాయణ తాత శ్రీనివాసరావు బుద్దాల వెంకట రామారావు మారిశెట్టి సుబ్బారావు వర్తనపల్లి కాశి సుభాషిని చీకటిమిల్లి మంగరాజు వట్టి బుజ్జి ముప్పిడి సంపత్ కుమార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Tags tadepalligudem
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News