Breaking News

ప్రజల నుండి సమస్యలపై అందే ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి సమస్యలపై అందే ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, సచివాలయ కార్యదర్శుల పై శాఖాపరమైన చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో స్పందన నిర్వహించారు.
కమిషనర్ తొలుత గతవారం స్పందన ఫిర్యాదుల పరిష్కారం, స్పందన పోర్టల్, ఈ.ఆర్.పి., వాట్స్ అప్, కాల్ సెంటర్ల ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారం పై అధికారులతో, సంబందిత కార్యదర్శులతో సమీక్షించి ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుండి అందే ఫిర్యాదుల పరిష్కారం పట్ల భాధ్యతతో వ్యవహరించాలని, ఫిర్యాదులను నిర్దేశిత గడువులోనే పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారం అనంతరం ఫిర్యాదికి సమాచారం తెలియచేయాలన్నారు. సమస్య పరిష్కారంకు ముందు, తర్వాత ఫోటోలు జత చేయాలన్నారు. నోడల్ అధికారులు సచివాలయ కార్యదర్శుల పనితీరు, సేవలు, స్థానిక సమస్యలపై పర్యవేక్షణ చేయాలని, ప్రతి సోమవారం నోడల్ అధికారులతో సచివాలయ పనితీరుపై సమీక్షా చేయాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు జరిగే స్పందనలో కార్యదర్శులు అందరూ ఉండాలన్నారు.
సోమవారం నిర్వహించిన స్పందనలో 60 ఫిర్యాదులు అందాయని వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 18, ఇంజినీరింగ్ విభాగం 12, ప్రజారోగ్య విభాగం 8, రెవెన్యూ విభాగం 7, ఉపా సెల్ విభాగం కి సంబధించి 3 ఫిర్యాదులు, ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.రోజా, డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, ఎస్.ఈ. భాస్కర్, సిటి ప్లానర్ మూర్తి, సి.ఎం.ఓ.హెచ్. డాక్టర్ విజయలక్ష్మీ, మేనేజర్ శివన్నారాయణ, ఏ.సి.పి.లు, ఆర్.ఓ.లు, ఈ.ఈ లు, యస్.యస్, సూపరిండెంట్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎల్‌బీఆర్‌సీఈలో పాఠశాలలు మరియు కళాశాల విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రవాణా శాఖ వారి అధ్యర్యంలో విద్యాసంస్థల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *