Breaking News

ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యం

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-1వ డివిజన్లో రూ. 40 లక్షల అభివృద్ధి పనులకు భూమిపూజ

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు మెరుగైన సౌకర్యాలతో పాటు ప్రజల చెంతకు పాలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 1వ డివిజన్ ఊర్మిళానగర్ లో రూ. 20 లక్షల వ్యయంతో సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులతోపాటు ఆదర్శ్ నగర్ 4, 5 రోడ్లలో రూ. 20 లక్షలతో సీసీ రహదారుల నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీతతో కలిసి సోమవారం ఆయన భూమిపూజ నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంజలో నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఇందులో భాగంగా శివారు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. మురుగునీటి పారుదల వ్యవస్థ, సౌకర్యవంతమైన రహదారులు, పుష్కలమైన తాగునీరు, మెరుగైన విద్యుత్‌ వ్యవస్థ వంటి సకల సదుపాయాలను కల్పించనున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు విన్నవించిన పనులకు రూ. 40 లక్షల నిధులతో భూమిపూజ నిర్వహించుకున్నట్లు తెలిపారు. అలాగే గుణదల ఆర్వోబీ స్టేజ్ -2 కి సంబంధించి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీఈ గురునాథం, ఏఈ వెంకటేష్, నాయకులు బండి వేణు, సురేష్, కనకరావు, మానికొండ సాంబశివరావు, కొంగితల శివ, నాయుడు, సుధాకర్, వీఎంసీ సిబ్బంది, స్థానికులు, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎల్‌బీఆర్‌సీఈలో పాఠశాలలు మరియు కళాశాల విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రవాణా శాఖ వారి అధ్యర్యంలో విద్యాసంస్థల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *