Breaking News

ప్రజల మనసెరిగి పాలన చేస్తున్న ముఖ్యమంత్రిని ఆశీర్వదించండి

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-24వ డివిజన్లో రూ. 20 లక్షల అభివృద్ధి పనులకు భూమిపూజ

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోనే ప్రజల మనసెరిగి పరిపాలన చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 24 వ డివిజన్ ఆర్.సి.ఎం.చర్చి రోడ్డులో రూ. 20 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు పనులకు స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్ తో కలిసి సోమవారం ఆయన భూమిపూజ నిర్వహించారు. చంద్రబాబు హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి అటకెక్కి, ప్రగతి పక్కదారి పట్టిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరలా పాలన గాడిన పడిందని తెలిపారు. నిధులను సక్రమంగా వినియోగించి ప్రజలకు అన్నీ రకాల మౌలిక సదుపాయాలను కలిస్తున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక డివిజన్లో రూ. 12 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడంతో పాటు, సచివాలయ పరిధిలోని అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ. 20 లక్షల నిధులను కేటాయిస్తుందని తెలిపారు. మరోవైపు గిరిపురంవాసులు ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యకు మరో నెల, రెండు నెలల్లో శాశ్వత పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఈ గురునాథం, నాయకులు కొమ్ము చంటి, మరియరాణి, నైనావతి, బొంగరాల భాస్కర్ రావు, కాజా శంకర్, మోహన్ రావు, మనోహర్, మోజస్, వీఎంసీ సిబ్బంది, స్థానికులు, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాలు.. ఈదురు గాలులు.. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి

-ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి -ఉత్తరాంధ్రకు ఎస్పీడీసీఎల్ నుంచి అదనపు సిబ్బంది -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *