విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రజా సమస్యలపై భారతీయ యోజనరైతు పార్టీ పోరాటం నిరంతరం పోరాటం చేస్తుందని భారతీయ యోజనరైతు పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మోరా పిచ్చిరెడ్డి అన్నారు. నగరం లోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోరా పిచ్చిరెడ్డి మాట్లాడుతూ భారతీయ యోజనరైతు పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కుల, మతాలకు అతీతంగా పనిచేస్తామని చెప్పారు. త్వరలో గ్రామస్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి కమిటీలు ఏర్పరిచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలియజేశారు. అలానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే విధానాలను ఎండగడతామన్నారు. నూతన సరికొత్త జాతీయ రాజకీయ పార్టీగా భారతీయ యోజనరైతు పార్టీ రిజిస్ట్రేషన్ సందర్భంగా కేంద్రీ ఎన్నికల కమిషన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జై కుమార్ గుప్త, డివి శివకుమార్, కంచర్ల రమేష్ బాబు , శాఖమూరి మల్లికార్జున్, చందన శేఖర్ కుమార్, ఎస్ కే హుస్సేన్, వి జయ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News