తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం అభివృద్ధి లో భాగంగా తిరుపతి అలిపిరి రోడ్డులో టూరిజం స్థలం 20 ఎకరాలను లీజ్ కం రెంట్ విధానంతో ఒప్పంద పత్రాలను మార్చుకున్నామని టూరిజం ఎం.డి. కన్నా బాబు అన్నారు. శనివారం మద్యాహ్నం స్థానిక అలిపిరి రోడ్డు లోని దివలోక్ వద్ద టూరిజం స్థలాన్ని లీజ్ కం రెంట్ విధానం ఒప్పంద పత్రాలను ఓబ్ రాయ్ హోటల్లో ని ప్రతినిధి రాజారామన్ శంకర్ , టూరిజం ఎం.డి. కన్నబాబు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒబెరాయ్ హోటల్స్ ప్రతినిధులకు పూర్ణకుంభ స్వాగతం పలికి భూ కేటాయింపు వివరించారు.దాదాపు రూ.100 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు టూరిజం కు ఆదాయం సమకూర్చడం, వసతుల వంటివి కలుగనున్నాయని తెలిపారు. అలిపిరి వద్ద టూరిజం వారి స్థలం 50 ఎకరాలు కాగా అందులో జు పార్క్ బఫర్ జోన్ గా 7.37 ఎకరాలు, 10.32 ఎకరాలలో దేవలోక్ నిర్మాణాలు, 20 ఎకరాలలో ఓబ్ రాయ్ హోటల్ నిర్మాణాలు సాగానున్నాయని తెలిపారు. ఓబ్ రాయ్ హోటల్ ప్రతినిధులకు కేటాయించిన స్థలం హద్దులను చూపి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, ఓబ్ రాయ్ హోటల్ సి.ఇ.ఓ. మరియు ఎం.డి. విక్రమ్ ఓబ్ రాయ్, కార్పోరేట్ అఫైర్స్ ప్రెసిడెంట్ రాజారామన్ శంకర్, ఫైనాన్స్ ఆఫీసర్ కల్లోల్ కుందా, టూరిజం ఆర్.డి. రమణ ప్రసాద్, డి.వి.ఎం. గిరిధర్ రెడ్డి, డి.టి.ఓ. రుపేంద్రనాథ్ రెడ్డి, ఇ.ఇ. సుబ్రహ్మణ్యం టూరిజం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News