విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, యన్.టి.ఆర్ జిల్లా వారు స్థానిక గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విద్యార్థులకు సి.పి.ఆర్ పై కళాశాల
ఆవరణలో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డిజాస్టర్ మేనేజ్ మెంట్ కొ ఆర్డినేటర్ రాధిక అశోక్ మాట్లాడుతూ డాక్టర్ జి.సమరం, ఐ.ఆర్.సి.యస్ చైర్మెన్, ఆదేశాల మేరకు యన్.టి.ఆర్ జిల్లాలోని కళాశాల లో ప్రతీ ఒక్క విధ్యార్ధి సి.పి.ఆర్ పై అవగాహన కలిగి ఉండాలన్న ఆదేశాల మేరకు ఈ రోజు పాల్టెక్నిక్ కళాశాల నందు ఈ శిక్షణా శిభిరాన్ని ఏర్పాటు చేశామని ఇందులో 50 మంది విద్యార్థులు కు శిక్షణ ఇవ్వడం జరిగింది. హఠాత్తుగా గుండెపోటు సంబవించినప్పుడుగుండె, ఊపిరి ఆగినప్పుడు మరలా తిరిగి పనిచేసే విధానాన్ని శిక్షణలో విద్యార్థులకు తెలియజేశారు ఇలా చేయడం వలన వ్యక్తిని డాక్టర్ ను సందర్శించే వరకు ప్రాణాలతో ఉండేలా ఈ ప్రక్రియ చేస్తుందని తద్వారా మనం ప్రాణం పోకుండా చేసినవారు అవుతామని ఆమె అన్నారు. అనంతరం ఎడ్యుకేషన్ టూర్ లో భాగంగా బెంజ్ సర్కిల్, నాస్కిక్ కేంద్రంలో ఉన్న బాపు దర్శన్, గోరా సైన్స్ సెంటర్, డాక్టర్ సమరం ఆసుపత్రిలో ఉన్న హెల్త్ సెంటర్ ఎక్జిబిషన్ ను150 విద్యార్థులు సందర్శించడం జరిగింది.
అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ విజయ సారధి మాట్లాడుతూ ఇలాంటి శిక్షణా కార్యక్రమాల వల్ల విద్యార్థులకు ఆరోగ్య విషయాలపై అవగాహన పెరుగుతూ
సమాజానికి కూడా మేలు అవుతుందని, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి కి కృతజ్ఞతలనుఆయనతెలిపారు. ఈ కార్యక్రమంలో నియంత గోరా, డైరెక్టర్, గోరా సైన్స్ సెంటర్, హెచ్.ఒ.డి ఎ.శివ ప్రసాద్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News