మార్చి13 న ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్ : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల కమీషన్ శాసనమండలి ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ నేడు విడుదల చేసిందని ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లాలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వర్చువల్ విధానంలో అన్ని జిల్లాల కలెక్టర్ లతో సమీక్ష నిర్వహించగా స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, డి.ఆర్.ఓ. శ్రీనివాసరావు, నియోజకవర్గాల ఇ.ఆర్.ఓ. లు హాజరయ్యారు.

జిల్లా కలెక్టర్ ప్రధాన ఎన్నికల అధికారి వారికి వివరిస్తూ ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఏర్పాట్లను సిద్ధం చేయనున్నామని అన్నారు. ఈ నెల 16 న ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ మండలి ఎన్నికల నోటిఫికేషన్ జారీ, 27 న నామినేషన్ల ఉపసంహరణ, మార్చి 13 న పోలింగ్, మార్చి 16 న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నామని అన్నారు. నేటి నుండే జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులోకి రానున్నదని వివరించారు. మండలి ఓటర్లకు సంబంధించి గత డిసెంబర్ 30న ఫైనల్ రోల్ మేరకు ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లు 5882, పోలింగ్ కేంద్రాలు 38, గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్లు 86906, పోలింగ్ కేంద్రాలు 62 వీటితో పాటు సహాయ పోలింగ్ కేంద్రాలు 37 ఉన్నాయని వివరించారు. క్లయిముల పరిశీలనకు సంబంధించి టీచర్స్ 168, గ్రాడ్యుయేట్స్ 1214 త్వరితగతిన పరిశీలించి పరిష్కరించానున్నామని వివరించారు. పోలింగ్ నిర్వహణ, కౌంటింగ్ శిక్షణ పి.ఓ. లకు, ఎ.పి.ఓ.లకు , ఓ.పి.ఓ. లకు, రూట్ ఆఫీసర్లకు శిక్షణ ఇవ్వనున్నామని, పోలీసు బందోబస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చెపట్టనున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేయనున్నామని అన్నారు. అవసరమైన బ్యాలెట్ బాక్సులు 1917 అందుబాటులో ఉన్నాయని, రెవిన్యూ, ప్రభుత్వ శాఖల అధికారులను, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల నిర్వహణకు ఉపయోగించుకోవడం జరుగుతుందని వివరించారు.

ఈ సమీక్షలో ఇ.ఆర్.ఓ.లు నగరపాలక కమీషనర్ అనుపమ అంజలి, కనకనరసారెడ్డి, కిరణ్ కుమార్, చంద్రముని, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, ఎలెక్షన్ తహశీల్దార్ పరమేశ్వర స్వామి, అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *