ఆంధ్ర లయోలా కళాశాలలో విద్యార్థులకు శిక్షణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, యన్.టి.ఆర్ జిల్లా వారు స్థానిక ఆంధ్ర లయోలా కళాశాల విద్యార్థులకు సి.పి.ఆర్ పై కళాశాల ఆవరణలో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ జి.సమరం, ఐ.ఆర్.సి.యస్ చైర్మెన్, మాట్లాడుతూ యన్.టి.ఆర్ జిల్లాలోని కళాశాల లో ప్రతీ ఒక్క విధ్యార్ధి సి.పి.ఆర్ పై అవగాహన కలిగి ఉండాలన్న ఉద్దేశం మేరకు ఈ రోజు ఆంధ్ర లయోలా కళాశాల నందు ఈ శిక్షణా శిభిరాన్ని ఏర్పాటు చేశామనీ అన్నారు. హఠాత్తుగా గుండెపోటు సంబవించినప్పుడుగుండె, ఊపిరి ఆగినప్పుడు మరలా తిరిగి పనిచేసే విధానాన్ని శిక్షణలో విద్యార్థులకు తెలియజేశారు ఇలా చేయడం వలన వ్యక్తిని డాక్టర్ ను సందర్శించే వరకు ప్రాణాలతో ఉండేలా ఈ ప్రక్రియ చేస్తుందని తద్వారా మనం ప్రాణం పోకుండా చేసినవారు అవుతామని ఆయన అన్నారు. అనంతరం ఎడ్యుకేషన్ టూర్ లో భాగంగా బెంజ్ సర్కిల్, నాస్కిక్ కేంద్రంలో ఉన్న బాపు దర్శన్, గోరా సైన్స్ సెంటర్, డాక్టర్ సమరం ఆసుపత్రిలో ఉన్న హెల్త్ సెంటర్ ఎక్జిబిషన్ ను విద్యార్థులు సందర్శించడం జరిగింది. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. ఏ పి కిషోర్ మాట్లాడుతూ ఇలాంటి శిక్షణా కార్యక్రమాల వల్ల విద్యార్థులకు ఆరోగ్య విషయాలపై అవగాహన పెరుగుతూ సమాజానికి కూడా మేలు అవుతుందని, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి కి కృతజ్ఞతలనుఆయనతెలిపారు. ఈ కార్యక్రమంలో నియంత గోరా, డైరెక్టర్, గోరా సైన్స్ సెంటర్, డాక్టర్ వై వి ప్రభు, వైస్ ప్రిన్సిపాల్,యన్ యస్ యస్ సిబ్బంది డాక్టర్ ఎ శామ్యూల్ దయాకర్,డాక్టర్ సురేష్,డాక్టర్ ఆర్ జాన్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *