రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం శుక్రవారం రోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రత్యూష్ కుమారి స్థానిక వై జంక్షన్ సమీపంలో ఉన్న ప్రభుత్వ బి.సి. సంక్షేమ బాలుర వసతి గృహమును సందర్శించారు. వసతి గృహ పరిసరాలు, వంటగదులు, టాయిలెట్లను పరిశీలించారు. వసతులు, పరిసరాల పరిశుభ్రత ఏమాత్రం సంతృప్తికరంగా లేవని, విద్యార్థులకు మరింత సుచికరమైన, రుచికరమైన భోజనం అందించాలని ప్రత్యూష కుమారి స్పష్టం చేశారు. తాగు నీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని, టాయిలెట్లు ప్రతిరోజూ శుభ్రం చేయించాలని వసతి గృహ సిబ్బందితో చెప్పారు. నగరంలోని ప్రతి సంక్షేమ వసతి గృహం తప్పనిసరిగా పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. విద్యార్ధులకు మంచి ఆహార, తాగు నీటి సదుపాయాలు అందించాలని అన్నారు.
Prajavartha Online Telugu News