రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
త్వరలో పూర్తి స్థాయి లో మోరంపూడి జంక్షన్ వద్ద పై వంతెన పనులు నిర్మాణం చేపట్టనున్న దృష్ట్యా ట్రాఫిక్ క్రమబద్దీకరణ పనులు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులు కలెక్టర్ ను కలవడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన పై వంతెన నిర్మాణానికి చెందిన పనులు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. మోరంపూడి జంక్షన్ వద్ద మోరంపూడి ఎన్ హెచ్ – 216 ఏ వద్ద నాలుగు లైన్ల ఫ్లైఓవర్ కి చెందిన ప్రాజెక్ట్ పొడవు: 1.42 కి.మీ పనుల నేపథ్యంలో ఎన్ హెచ్ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా తగిన సూచనలు చెయ్యడానికి ట్రాఫిక్ పోలీసులు క్షేత్ర స్థాయి పర్యటన చేసి సూచనలు చెయ్యడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ ను కలిసిన వారిలో కాంట్రాక్ట్ ఎజెన్సీ కి చెందిన మేనేజర్ సురేష్ కుమార్ తదితరులు కలిశారు.
Prajavartha Online Telugu News