బి.సి. సంక్షేమ బాలుర వసతి గృహమును సందర్శన…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం శుక్రవారం రోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్  కె.ప్రత్యూష్ కుమారి స్థానిక వై జంక్షన్ సమీపంలో ఉన్న ప్రభుత్వ బి.సి. సంక్షేమ బాలుర వసతి గృహమును సందర్శించారు. వసతి గృహ పరిసరాలు, వంటగదులు, టాయిలెట్లను పరిశీలించారు. వసతులు, పరిసరాల పరిశుభ్రత ఏమాత్రం సంతృప్తికరంగా లేవని, విద్యార్థులకు మరింత సుచికరమైన, రుచికరమైన భోజనం అందించాలని ప్రత్యూష కుమారి స్పష్టం చేశారు. తాగు నీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని, టాయిలెట్లు ప్రతిరోజూ శుభ్రం చేయించాలని వసతి గృహ సిబ్బందితో చెప్పారు. నగరంలోని ప్రతి సంక్షేమ వసతి గృహం తప్పనిసరిగా పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. విద్యార్ధులకు మంచి ఆహార, తాగు నీటి సదుపాయాలు అందించాలని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *