Breaking News

ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా రూ. 10 లక్షల విలువైన ఎల్ఓసి పత్రం అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు సంజీవని వంటిదని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న 23వ డివిజన్ సూర్యనారాయణ వీధికి చెందిన గోపి రమణ(54) అనే మహిళ.. ఎప్లాస్టిక్ ఎనీమియా చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ మేరకు మహిళకు మంజూరైన రూ. 10 లక్షల ఎల్ఓసి పత్రాన్ని శుక్రవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనము నందు కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి తేవాలనే కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు చెప్పారు. అలాగే అత్యవసర సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు గత పాలనలో పేద రోగులు ఆర్థిక భారంతో చితికిపోయేవారని.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో ఆపదలో ఉన్న ప్రతిఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి అందుతోందన్నారు. అత్యవసర సమయాల్లో రోగులకు ఆరోగ్యశ్రీ ఆస్పత్రులపై అవగాహన కల్పించేందుకు.. జనహిత సదనములో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను ప్రజలు సద్వినియోపరచుకోవాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న తమకు చేయూతనిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి మహిళ కుటుంబసభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *