Breaking News

ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ -2023 లోగో ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో లోగోను ఆయన ఆవిష్కరించారు. వాస్తవిక పెట్టుబడులు లక్ష్యంగా సదస్సు జరగనుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. ఏపీలో అవకాశమున్న రంగాలలో పెట్టుబడులను ఆకర్షించేలా, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను సమగ్రంగా వివరించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అలాగే ఎంఎస్ఎంఈలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు మల్లాది విష్ణు వివరించారు. ఈ కార్యక్రమానికి 15 మంది కేంద్ర మంత్రులు, 15 మంది ముఖ్యమంత్రులు, 44 మంది ప్రపంచ పారిశ్రామికవేత్తలు, 53 మంది భారతీయ పరిశ్రమల ప్రముఖులు, వివిధ దేశాల రాయబారులను ఇప్పటికే ఆహ్వానించడం జరిగిందన్నారు. ఈ సమ్మిట్‌ విజయవంతమై రాష్ట్రానికి భారీగా ఎంఓయూలు జరగాలని.. యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు లభించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో SSCCI కో-ఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ మెంబర్ ప్రభు వికాస్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *