ఎం.ఎల్.సి. ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం

-గ్రాడ్యుయేట్లకు 25, టీచర్లకు 4 పోలింగ్ కేంద్రాలు
-కమిషనర్ అనుపమ అంజలి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి నియోజకవర్గ పరిధిలో నిర్వహించనున్న శాసనమండలి ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్, శాసనమండలి ఎన్నికల నిర్వహణాధికారి అనుపమ అంజలి అన్నారు. నగరంలోని పోలింగ్ కేంద్రాల వద్ద జరుగుతున్న ఏర్పాట్లను శనివారం అధికారులు, సిబ్బందితో కలిసి కమిషనర్ అనుపమ అంజలి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎం.ఎల్.సి. ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల అయ్యిందన్నారు. అందులో భాగంగానే అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారన్నారు. తిరుపతి నియోజకవర్గ పరిధిలో గ్రాడ్యుయేట్ ఓటర్లకు 25, టీచర్లకు 4 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు తగినన్ని బ్యాలెట్ బాక్సులు ఉన్నాయని, వాటిల్లో కొన్నింటికి చిన్న చిన్న మరమ్మత్తులు కూడా పూర్తి చేయిస్తున్నామన్నారు. శాసనమండలి ఎన్నికల సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు బాగా చేస్తున్నామన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఇప్పటికే సమావేశం నిర్వహించామని, వారి వద్ద నుండి కూడా మరింత సమాచారం తీసుకున్నామన్నారు. ఇప్పటికే 200 డబుల్ ఎంట్రీ ఓట్లను గుర్తించామన్నారు. ఈ జాబితాను బి ఎల్ ఓ లకు ఇచ్చి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి తొలగిస్తామన్నారు. కమిషనర్ వెంట ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, తహసీల్దార్ వెంకటరమణ, డెప్యూటీ తహశీల్దార్ జీవన్ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *