రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కాకినాడ, కోనసీమ మరియు తూర్పు గోదావరి జిల్లా లో గల ప్రముఖ కంపెనీల నందు వివిధ ట్రేడు లలో ట్రేడు అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఐ.టి.ఐ. లో ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా ఈ నెల 13 వ తేదీన సోమవారం ఉదయం 8 గంటల నుంచి నిర్వహించబడునని తూర్పు గోదావరి జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ జి. వి. రమణ రావు శనివారం ఒక పత్రిక ప్రకటన లో తెలియజేశారు. ఈ మేళా ద్వారా ప్రముఖ కంపెనీల నందు సుమారు 200 ఖాళీలు భర్తీ చేయబడును. ప్రధానం గా ప్రముఖ కంపెనీ అయిన టాగూర్ ల్యాబోలేటెరీస్ ప్రైవేట్ లిమిటెడ్, తాళ్ళపూడి నందు ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, వెల్డర్, పేయింటర్, బాయిలర్ ఆపరేటర్ మరియు డ్రాఫ్ట్ మెన్ సివిల్ ట్రేడు ల నందు సుమారు 150 ఖాళీలను భర్తీ చేయబడును. ఎంపిక కాబడిన అభ్యర్ధులకు 8,000/- స్టయిఫండ్, మధ్యాహన భోజన సదుపాయం మరియు రవాణా సౌకర్యం ఉచితం గా కల్పించబడును, శిక్షణ కాలం పూర్తి అయిన తరువాత కంపెనీలో ఉద్యోగ అవకాశము కల్పించబడును ఉద్యోగ కాలం లో జీతముతో పాటు రవాణా సౌకర్యం, క్యాంటీన్ వసతి, బోనస్ మరియు ఇన్సెంటివ్ కూడా ఇవ్వబడును. అదే మాదిరిగా మరికొన్ని ఇతర ప్రముఖ కంపెనీల యందు కూడా అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ సౌకర్యము ఈ మేళా లో కల్పించబడును. కావున ప్రభుత్వ మరియు ప్రైవేటు ఐ.టి.ఐ. లో వివిధ ట్రేడు లలో ఉత్తీర్ణులైన అభ్యర్ధులు తమ యొక్క అప్రెంటిస్ షిప్ ప్రొపైల్ తో పాటు ఒక జత జెరాక్స్ కాపీలతో హాజరు కావలయును. మేళాకు హాజరగు అభ్యర్ధులు అప్రెంటిస్ ఐ.బి.ఎం పోర్టల్ https://dgt.gov.in/appmela2022 లో ముందుగా తమ పేరు నమోదు చేసుకొనవలెనని మరియు తేదీ. 13-02-2023 సోమవారం ఉదయం 8.00 గం. ల నుండి మేళా సెంటర్ లో స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేయబడును. కావున అభ్యర్థులు ఈ మేళాకు తప్పక హాజరై అప్రెంటిస్ అవకాశాలను అందిపుచ్చుకోగలరని పూర్తి వివరములకు 9676560002. 9848738841 నెంబర్లో సంప్రదించ వచ్చునని తూర్పు గోదావరి జిల్లా కన్వీనర్ మరియు ప్రిన్సిపాల్ శ్ జి. వి. రమణ రావు ఆ ప్రకటన తెలిపారు.
Prajavartha Online Telugu News