జంతర్ మంతర్ వద్ద బీసీల డిమాండ్ల పై చేసిన నిరసనలు విజయవంతం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీల డిమాండ్ల పై చేసిన నిరసనలు విజయవంతం అయ్యాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గ నరేష్ తెలిపారు. బీసీ నాయకులు నడుం బిగించి తమ నిరసనను ఢిల్లీలో తెలియచేసారన్నారు. రాబోయే కాలంలో ఢిల్లీలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి మా గళం వినిపిస్తామన్నారు. గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గ నరేష్ మాట్లాడుతూ బీసీ లకు చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు, బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఇతర డిమాండ్లు పై ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడికి పిలుపు ఇచ్చామని తెలిపారు. ఈ ముట్టడి కార్యక్రమంలో బీసీలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసారని అన్నారు. ఢిల్లీలో 13 జాతీయ పార్టీలను కలిసి వారి మద్దతు తీసుకున్నామన్నారు. ఢిల్లీలో తాము చేస్తున్న నిరసనలలో భాగంగా కేంద్ర సోషల్ జస్టిస్ మంత్రి రామ్ దాస్ అతావులే ని కూడా కలిసామని బీసీ లకు కేటాయించిన రెండు వేల కోట్ల బడ్జెట్ వెనక్కి తీసుకొని తమ డిమాండ్ల ను కేంద్ర అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంతో కేంద్రం నుంచి కూడా తమకు సానుకూలంగా స్పందన లభించింది అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తమ గళాన్ని మరింతగా వినిపిస్తామన్నారు. ఐదు వందల మందితో ఢిల్లీ వెళ్లి తమ డిమాండ్ల గురించి మరోసారి పోరాడతామన్నారు. ఢిల్లీలో తమ నిరసన తెలియచేయటనికి సహకరించిన సీఎం జగన్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య సూచన ప్రకారం ఢిల్లీలో తమ నిరసన తెలియచేసామన్నారు. తమ హక్కులు కోసం భవిష్యత్తు లో మరింతగా పోరాడతామన్నారు. బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ కేటాయించే వరకు తమ పోరాటం అగదన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పట్నాల హరిబాబు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పోతిన వర ప్రసాద్, స్టేట్ ప్రచార కమిటీ ఇంచార్జ్ పిళ్ల దినేష్ కృష్ణ, రాష్ట్ర మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ మెండే జ్యోతి, యువజన నాయకులు ఆర్.విక్రమ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *