-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాసమస్యల పరిష్కార దిశగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమములో మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి ప్రజల నుండి 14 ఆర్జీలను స్వీకరించి ప్రజలు తెలిపిన సమస్యలపై అధికారులను వివరాలు అడిగితెలుసుకొన్నారు. నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు కల్పిస్తున్నమౌలిక సదుపాయాలలో ఎదురౌతున్న ఇబ్బందులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నేటి స్పందన కార్యక్రమములో పట్టణ ప్రణాళిక – 6 ఇంజనీరింగ్ – 3, రెవిన్యూ– 2, ప్రజారోగ్య – 1 మరియు యు.సి.డి -2 అర్జీలు వచ్చినవి.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్) యం.శ్యామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ యం. ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, ఎస్.ఇ నరసింహ మూర్తి, ప్రాజెక్ట్ ఆఫీసర్ శకుంతల, మేనేజర్ బి.శ్రీనివాస్ రావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 5 అర్జీలు.
జోనల్ కమిషనర్లు నిర్వహించిన స్పందన కార్యక్రమములో సర్కిల్ –3 పరిధిలో ఇంజనీరింగ్ విభాగం – 1, పట్టణ ప్రణాళిక –1, సర్కిల్ – 2 నందు పట్టణ ప్రణాళిక –‘3 అర్జీలు అందించగా సర్కిల్ –1 పరిధిలో ఎటువంటి అర్జీలు అందనట్లు జోనల్ కమిషనర్ తెలియజేసారు.
Prajavartha Online Telugu News