-అర్జీలు నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు.
– ఏ ఒక్క అర్జీ రీ ఓపెన్ కాకుండా పరి ష్కారం చూపాలి
-అర్జీల పరిష్కారం క్షేత్రస్థాయిలో చేసే విధంగా చర్యలు
-వెబ్ పోర్టల్ ఏర్పాటు ద్వారా సత్వర పరిష్కారం కోసం చర్యలు
-జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనలో వచ్చిన ప్రతి అర్జీ 24 గంటల లోపు పరిశీలన చేసి నిర్ణీత సమయంలోగా నాణ్యతతో కూడిన పరిష్కారాన్ని చూపి అర్జీదారునికి తెలియచేయాలని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత పేర్కొన్నారు.
సోమవారం స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కె. మాధవీలత, డీఆర్వోఓ జి. నరశింహులు, జిల్లా అధికారులతో కలసి ప్రజలు నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది. స్పందన లో భాగంగా ఆయా మండలాల నుంచి జిల్లా కేంద్రానికి అర్జీలు ఇచ్చిన వారి సమస్య పై తహశీల్దార్లు, ఇతర అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని 24 గంటలలోపు పరిశీలించి, నిర్ణీత సమయంలో నాణ్యతతో కూడీన విధంగా పరిష్కరించి అర్హత కలిగిన అర్జీదారులకు సకాలంలో న్యాయం చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రజల నుండి స్పందనలో రెవెన్యూ, పోలీసు, వ్యవసాయశాఖ, హెల్త్, పంచాయితీకి ఐదు శాఖలకు సంబంధించి అధిక సంఖ్యలో అర్జీలు వస్తున్నాయన్నారు. అర్జీలు పూర్తి స్థాయిలో పరిష్కారం నిమిత్తం సచివాలయ, మండల, డివిజన్ జిల్లా స్థాయిలో ప్రోజెక్టు మోనేటరింగ్ యూనిట్ (సెల్) ఏర్పాటు చేయడం జరుగుతుదన్నారు. వీరు ఆయా శాఖల వారీగా స్పందనలో వచ్చిన అర్జీలు పరిష్కరించే అంశంపై సమగ్ర పరిశీలన చేస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెబ్ పోర్టల్ త్వరలో ప్రారంభించనున్నందున జిల్లాలో శాఖాపరంగా స్పందనలో వచ్చే అర్జీలను నిర్ణీత సమయంలోనే జవాబుదారీ తనం తో పరిష్కరించాల్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి నేడు స్పందనలో 180 అర్జీలను స్వీకరించామని కలెక్టరు మాధవీలత తెలిపారు.
నేటి వరకు జిల్లా పరిధిలో మొత్తం 375 అర్జీలు పరిష్కారం ఇవ్వవలసి ఉన్నట్లు కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు . స్పందన అర్జీలకు చెంది పరిష్కరించాల్సిన వాటిలో 24 గంటల్లో 4 అర్జీలు, 48 గంటల్లో 10 అర్జీలు, 72 గంటల్లో వి 12 అర్జీలు ఉన్నాయని అన్నారు. రీ ఓపెన్ అయినవి 20 ఉండగా వాటికి సహేతుకమైన వివరణ అర్జీ దారులకు ఇవ్వడం ద్వారా అర్హత ఉన్న అర్జీలు పరిష్కారం చూపాలని ఆదేశించారు.
స్పందనలో వచ్చిన కొన్ని అర్జీలు .
దేవరపల్లి మండలం త్యాజంపూడి గ్రామ నివాసి వల్లభని అనంత లక్ష్మి తమ అర్జీ లో తన భర్తకు దివ్యాంగుని కోటాలో ప్రభుత్వం 90సెంట్లు భూమిని మంజూరు చేసి ఇచ్చిన్నారని, అయితే త్యాజంపూడి వీఆర్వో పట్టాదారు పాస్ పుస్తకం 58 సెంట్లు గా ఇచ్చారు. మిగిలిన భూమిని కూడా చేర్చి ఇప్పించవసిందిగా వారు ఆ అర్జీలో కోరారు. ఈ అంశంపై కలెక్టర్ స్పందిస్తూ వెంటనే సమస్యను పరిష్కరిచి నివేదిక సమర్పించాలని దేవరపల్లి తహసీల్దార్ కు జామ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.
రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేట జానచైతన్య హౌసింగ్ కాలనీ నందు సుమారు 50 కుటుంబాలు నివసిస్తున్నాయని, ఇక్కడ సరైన వసతులు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున అంతర్గత రహదారులు, డ్రైనేజి, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని కాలనీ వాసి శీరపు మురళీ కృష్ణ తమ అర్జీలో పేర్కొన్నారు.
సీతానగరం మండలం చిన కొండేపూడి గ్రామనివాశి పేర్ల అనంత లక్ష్మి తమ అర్జీలో నాకు వీలునామా 524 ద్వారా సంక్రమించబడిన 144చ.గ. నందు కొంత నివాశం కొరకు రేకుషెడ్ నిర్మించుకొని యున్నాను. మిగిలిన స్థలం ఖాలీగా ఉన్నందున ఖాలీ స్థలం ను గ్రామంలోని కొందరు ఆక్రమించుకున్నారు. కావున ఆక్రమణకు గురైన తన భూమిని తనకు ఇప్పంచి న్యాయం చేయాలని కోరారు.
దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన రైతు ఎల్.సుబ్బారావు తన అర్జీలో 653-1 సర్వే నెం.లో తనకున్న 3.24 సెంట్లు భూమి ఆన్ లైన్ లో పూర్తిగా నమోదు కాలేదని, సదరు నాభూమిని సర్వే చేయించి నాకున్న పూర్తి భూమిని ఆన్ లైన్ లో పొందు పర్చాలని కొరారు.
ఈ స్పందన కార్యక్రమము లో డీఆర్వో జి. నరశింహు లు, డి ఎం హెచ్ ఓ డా. కే వెంకటేశ్వరరావు, డిసిహెచ్ఒ డా.ఎమ్.సనత్ కుమారి, సీపీఓ కె.ప్రకాష్ రావు, డీ పి వో పి. జగదాంబ, పశుసం వర్ధక శాఖ అధికారి ఎస్ జీ టి సత్యగోవింద్, డ్వామా పీ డి జిఎస్ రామగోపాల్, ట్రైబుల్ వెల్ఫేర్ అధికారి కే. జ్యోతి, డి ఎస్ ఒ ప్రసాదరావు, డిఎల్డిఒ పి. వీణా దేవి, ఆర్డబ్యూ ఎస్. ఈ బాల. శంకర్, పంచాయతీ రాజ్ ఎస్ ఈ ఏవిబి ప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారి ఎస్. మాధవరావు, ఆర్టీఒ కృష్ణారావు, డిఆర్డిఏ పిడి ఎస్. సుభాషిణి, డి హెచ్ వో వి. రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News