మంగళవారం సైకిల్ ఫర్ హెల్త్” ర్యాలీ

-కంబాల చెరువు యుపీహెచ్ సెంటరు నుంచి ప్రారంభం
-జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సైకిల్ ఫర్ హెల్త్”  ద్వారా విద్యార్థులతో సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కె. మాధవీలత తెలిపారు. ఆజాదీకా అమృతమహోత్సవంలో భాగంగా కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో “సైకిల్ ఫర్ హెల్త్” అనే నూతన కార్యక్రమానికి మంగళవారం శ్రీకారం చుడుతున్నట్టు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి పీహెచ్ సీ, యుపీహెచ్ సీ, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కేంద్రాల పరిధిలో  ప్రతి నెల 14 వ తేదీ  ఒక్కొక్క సెంటర్ లో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. రేపు నిర్వహించే జిల్లా స్థాయి“సైకిల్ ఫర్ హెల్త్” అవగాహన ర్యాలీ కార్యక్రమం  కంబాల చెరువు యుపీహెచ్ సెంటరు నుంచి నిర్వహిస్తారన్నారు. ఇందుకు సంబందించి  వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థలు సైకిల్ ర్యాలీలో పాల్గొనే విధంగా  ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *