-ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు అవగాహన కార్యక్రమాలు
-జిల్లా కలెక్టర్ కే. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఈ నెల 13 తేదీ నుండి 17 వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను జయప్రదం చేయాలని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపొందించిన ఆర్థిక ఆక్షరాస్యతపై ప్రజల్లో అవగాహన కోసం రూపొందించిన గోడ ప్రతులను జిల్లా కలెక్టరు మాధవీలత ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా కలెక్టరు కె. మాధవీలత మాట్లాడుతూ సమాజంలో ప్రతి పౌరుడు బ్యాంకింగ్ వ్యవహారాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ క్రమంలో బ్యాంకు ఖాతాల నిర్వహణ, ఆర్థిక పరంగా నిధులు భద్రతతో సురక్షితమైన ప్రవర్తనకు సమాజం అలవాటు పడాలని కోరారు. జిల్లాలోని అన్ని బ్యాంకులు, ప్రభుత్వ శాఖలు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సమన్వయంతో ప్రజలను, బ్యాంకు ఖాతాదారులను చైతన్య పరచాలని కోరారు. బ్యాంకులు ద్వారా అందిస్తున్న రుణ పరపతి సౌకర్యాలు, ఫిర్యాదులు పరిష్కారం, ఆర్థిక సైబర్ నేరాల నియంత్రణపై అక్షరాస్యత, నిరక్షరాస్యత అనే బేధం లేకుండా ప్రతి ఒక్కరిలో అవగాహన అవసరం అన్నారు. ఈ క్రమంలో బ్యాంకులు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని కోరుతూ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రిజర్వ్ బ్యాంకు చెప్పట్టిన ఈ ప్రచార కార్యక్రమాన్ని కలెక్టరు అభినందించారు. అధికారులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్య మవ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ అధికారి జీ. దిలీప్ కుమార్, డిఆర్వో జి. నరశింహులు, బ్యాంకు సిబ్బంది జీ.శ్రీధర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News