-జిల్లాలో పెట్రోల్ బంక్ తనిఖీలు 30 రోజుల్లో పూర్తి చేయాలి
-జె కె సి అర్జీలు పరిష్కారం కోసం డివిజన్, మండల స్థాయి కమిటీ లు
-ఆయుష్మాన్ భవ కింద ప్రతి ఒక్కరి డేటా ఈ కె వైసి పూర్తి చేయాలి…
-ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఎంపీడీఓ లు పర్యవేక్షణ అవసరం
-కలెక్టర్ డా కే. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జే కే సి, సర్వే బృందం గుర్తించిన అంశాలు, రీ సర్వే, వ్యవసాయ రంగం లో ఈ కేవైసి, ఉపాధి హామీ, ఆయుష్మాన్ భవ, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వం క్షేత్ర స్థాయి లో గుర్తించిన సమస్యలపై నివేదిక ఇవ్వడం జరిగిందని అన్నారు.
మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సేవా రంగం కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సర్వే బృందం పంపి జిల్లాలో 1958 సమస్యలు గుర్తించినట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు. వీటిలో 1234 మౌలిక సదుపాయాల అభివృద్ధికి, 241 మానవ వనరులు, సేవారంగం లో 503 ఉన్నట్లు తెలిపారు. వాటి వివరాలు మండలాలు వారీగా తెలియ చెయ్యడం జరుగుతుందని అన్నారు. వీటిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.
జిల్లాలో లైసెన్సు పొందిన పెట్రోల్ బంక్ లను రెవెన్యూ డివిజన్ అధికారులు, తహశీల్దార్లు క్షేత్ర స్థాయి లో నిర్ణీత పట్టిక ద్వారా తనిఖీలు చేపట్టి 30 రోజుల్లో నివేదిక అందచేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ లో ఏ రోజు తనిఖీ వివరాలు ఆరోజు నమోదు చేయాల్సి ఉంటుందని మాధవీలత అన్నారు. ఇందుకు గాను ఆర్డీవో డివిజన్ పరిధిలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి, 30 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చెయ్యాలని ఆదేశించారు.
శివరాత్రి రోజున ఎటువంటి ఘటనలు జరగకుండా కొవ్వూరు, రాజమహేంద్రవరం డివిజన్ అధికారులు , మునిసిపల్ కమిషనర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి నివేదిక అందచేయాలన్నారు.
జె కె సి సంబంధించి మండల పరిధిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకోవాలని మాధవీలత పేర్కొన్నారు. రెవెన్యూ, పంచాయతీ, మెడికల్, పోలీస్, వ్యవసాయ శాఖ ల పరంగా ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ శాఖ అంశాలపై తహశీల్దార్, పంచాయతీ రాజ్, పురపాలక పై ఎంపిడిఓ/ మునిసిపల్ కమిషనర్, హెల్త్ పై డి ఎమ్ హెచ్ వో, పోలీస్ అంశాలపై- ఎస్పీ, వ్యవసాయ శాఖ- అనుబంధ శాఖల పై జిల్లా వ్యవసాయ అధికారి ఆయా శాఖల ద్వారా ఆయా శాఖల టీమ్స్ వెయ్యాలని అన్నారు. తద్వారా జె కె సి లకు చెందిన సమస్యకు ఎప్పటికప్పుడు అర్జీల పరిష్కారం చూపాలి.
ఉపాధి హామీ పథకం కింద పై కలెక్టర్ మాధవీలత సమీక్ష చేస్తూ, జిల్లాకు కేటాయించిన లక్ష్యంలో ఇప్పటి వరకూ 77 శాతం మేర మాత్రమే లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు. కోరుకొండ మండలంలో 66 శాతం లక్ష్యం పూర్తి చేశారని, ఇంకా లక్షా అరవై ఆరువేలు పనిదినాలు, దేవరపల్లి 68 శాతం పని దినాలు లక్ష పనిదినాలు సాధించ వలసి ఉందన్నారు. ప్రతి మండలం వారి మండలానికి చెందిన పెండింగ్ పని దినాలు రోజు వారి లక్ష్యాల మేరకు రాబోయే 45 రోజుల కార్యాచరణ ప్రణాళిక అందచెయ్యలని ఆదేశించారు . లక్ష్యం సాధించడం లో ఎటువంటి మినహాయింపు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు.
ఈ కేవైసి కి సంబంధించి ప్యాడి సేకరణ కోసం మాత్రమే కాదు, వ్యవసాయ రంగం పై ఆధారపడిన రైతులకు ప్రభుత్వ పంరంగా అందచేసే సబ్సిడీ, సబ్సిడీ తదితర పథకాలు వర్తింపునకు ఈ కైవైసి తప్పనిసరి అని మాధవీలత పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో రైతులు ప్రతి సీజన్ లో అవగాహన కల్పించే విధంగా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కస్టమర్ హైరింగ్ సెంటర్ ఏర్పాటు, అర్భికే ద్వారా సేవల పై మరింత నిబద్దత కలిగి ఉండాలని అన్నారు. ఆయా అర్భికే ల ద్వారా అందచేస్తున్న సేవలు పై నివేదిక అందచేయాలని కలెక్టర్ మాధవీలత అన్నారు..
ఆయుష్మాన్ భారత్ కింద జిల్లాలో 7,55,271 కుటుంబాలకు చెందిన డేటా పోర్టల్ కు ఈ కెవైసి అనుసంధానం చేసేందుకు లక్ష్యం నిర్దేశించడం జరిగిందని, ఇప్పటి వరకు 3,08,407 (59.17 శాతం) మాత్రమే డేటా సేకరణ చేసినట్లు మాధవీలత అన్నారు. ఈ విధానంలో సచివాలయ వారీగా ఆయుష్మాన్ భారత్ గణాంకాల వారీగా సమీక్ష చేయడం జరిగిందని అన్నారు. వచ్చే వారం నాటికి పూర్తి స్థాయి ప్రగతి దిశగా అడుగులు వేసి సర్వే పూర్తి చెయ్యాలని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ పరంగా వైద్య సేవలు పొందిన బాలింతలకు చెందిన డేటా ను ఎప్పటికప్పుడు ఆశా కార్యకర్తలు వాటి వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. ఇప్పటి వరకు 66 శాతం మేరకు మాత్రమే వాటి వివరాలు నమోదు చేశారని, నూరు శాతం డేటా ఎంట్రీ పూర్తి చెయ్యలని అన్నారు.
స్థానిక సంస్థలకు చెందిన ఎం ఎల్ సి ఎన్నికల ఓటర్ల జాబితా మేరకు ఓటర్ల వివరాలు, ఫోటో గుర్తింపు, ఎపిక్ కార్డ్ ఆధారంగా చేసుకుని నిర్ధారణ చేసుకోవాలన్నారు. పట్టణ పరిధిలో ఉన్న రాజమహేంద్రవరం, కొవ్వూరు తహాశీల్దర్ కార్యాలయాల్లో ఓటింగ్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
జిల్లా అధికారులు, క్షేత్ర స్థాయి లో ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపిడివో లు, ఇతర అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News