ఉగాదికి 16 వేల సామూహిక గృహ ప్రవేశాల లక్ష్యాన్ని సాధించాలి..

-లక్ష్య సాధానలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉగాదికి 16 వేల సామూహిక గృహ ప్రవేశాలను నిర్వహించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు అహర్నిశలు కృషి చేయాలని లక్ష్య సాధనలో అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఆదేశించారు.
జిల్లాలో జగనన్న గృహ నిర్మాణాల ప్రగతి పై స్థానిక కలెక్టరేట్‌ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి బుధవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, మున్సిపల్‌ కమీషనర్లు, యంపిడివోలు, స్పెషల్‌ ఆఫీసర్లు, తహాశీల్థార్లు, ఇంజనీరింగ్‌ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాలో జగనన్న కాలనీలలో నిర్మిస్తున్న గృహాలలో ఉగాది నాటికి సుమారు 16 వేలకు పైగా గృహలలో లబ్దిదారులతో గృహ ప్రవేశాలు జరిపించాలని లక్ష్యంగా నిర్థేశించుకున్నామన్నారు. ఇప్పటికే 7,821కు పైగా గృహ నిర్మాణాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. మరో వివిధ దశలలో ఉన్న 8,526 గృహాలతో పాటు తుది దశలో ఉన్న 2,615 గృహాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. తుది దశ నిర్మాణంలో ఉన్న గృహాలకు చెందిన లబ్దిదారులతో తక్షణమే ముఖాముఖి మాట్లాడి నిర్మాణం పూర్తి చేయడంలో వారికి ఎదురవుతున్న సమస్యలను గుర్తించాలన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి సాధ్యమైనంత త్వరలో నిర్మాణాలను పూర్తి చేసి లక్ష్యాలను సాధించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. 3,405 గృహాలు రూప్‌ లెవల్‌ దశలో ఉన్నాయని, 2,506 గృహాలు రూప్‌ లెవల్‌ నుండి రూప్‌ కాస్టింగ్‌ దశకు చేరుకోవడం జరిగిందన్నారు. నిర్మాణాలను పూర్తి చేయడంలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పడు తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. లబ్దిదారులతో ప్రతి రోజు పరస్పరం చర్చించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. రూప్‌ లెవల్‌ రూప్‌ కాస్టింగ్‌ లెవల్‌లో ఉన్న గృహా నిర్మాణాలను పూర్తి చేయడంలో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు పశ్చిమ సెంట్రల్‌ నియోజకవర్గాల లబ్దిదారులకు కేటాయించిన లే అవుట్లలో ప్రారంభించవలసిన గృహలు, మండలాలు, మున్సిపల్‌ పరిధిలోని లేఅవుట్లలో ప్రారంభించవలసిన గృహా నిర్మాణాలను పూర్తి చేసేలా లక్ష్యాలను నిర్థేశించుకోవాలని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో హౌసింగ్‌ పిడి శ్రీదేవి, డిఇ రవికాంత్‌, కలెక్టరేట్‌ భూ విభాగ సూపరిండెంట్‌ యం దుర్గాప్రసాద్‌, జిల్లాకు చెందిన మండల స్పెషల్‌ ఆఫీసర్లు యంపిడివోలు, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *