గర్భిణీలు, బాలింతలపై ప్రత్యేక దృష్టి పెట్టి మాతాశిశు మరణాలను నివారించండి..

-జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గర్భిణీలు బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి మెరుగైన వైద్య సహాయం అందించడం ద్వారా మాతా శిశు మరణాలను పూర్తిగా నివారించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు వైద్యాధికారులు సిబ్బందిని ఆదేశించారు.
మాతా శిశు మరణాల నివారణపై బుధవారం కలెక్టర్‌ కార్యాయంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరం నందు కలెక్టర్‌ డిల్లీరావు జిల్లాకు చెందిన వైద్యాధికారులు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మాతా శిశు మరణాల నివారణపై వైద్యాధికారులు మరింత ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన వైద్యాధికారులు, సిబ్బంది, తమ పరిధిలో గర్భందాల్చిన మహిళలను గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ పూర్తి వైద్య సహాయం అందించాల్సిన అవసరం వుందన్నారు. ఇటీవల కొండపల్లి పిహెచ్‌సి పరిధిలో గొల్లపూడికి చెందిన పల్లె చైతన్య ఆంధ్రా ఆసుపత్రిలో ప్రసవం అయిన మూడవ రోజు మరణించడం జరిగిందన్నారు. విజయవాడ రాణిగారి తోటకు చెందిన ఎల్‌ సంతోషి ఆమె తల్లిదండ్రుల స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 8వ నెల గర్భిణి సమయంలో మరణించడం జరిగిందన్నారు. అలాగే ఏ కొండూరు మండలం చీమలపాడుకు చెందిన బాణోతు పద్మ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయిన 6వ రోజు శిశువు మృతి చెందడం జరిగిందన్నారు. జగ్గంపుడికి చెందిన కె. భవ్య విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం రెండవ రోజు శిశువు మరణించడం జరిగిందన్నారు. మతాశిశువుల మరణాలకు గల కారణాలను పూర్త స్థాయిలో విశ్లేషించి భవిష్యత్‌లో ఇటువంటి మరణాలు సంభవించకుండా కృషి చేయవాలసిన భాధ్యత వైధ్యాధికారులపై ఉందన్నారు. కుటుంబ సభ్యులలో దీర్ఘకాలిక వ్యాధులు, పౌష్టికాహారంలోపం ఉన్న గర్భిణీల ఆరోగ్యం పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరీక్షించాలన్నారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, పౌష్టికాహారలోపాలను కుటుంబ సభ్యులకు వివరించి వారు కూడా ఆరోగ్య పరిస్థితులను గమనించుకునేలా చైతన్యవంతులుగా చేసిన్నట్లయితే అనుకున్న ఫలితాలను సాధించగలుగుతామన్నారు. ఆశా వర్కులు, అంగన్‌వాడీ కార్యక్రర్తలు గర్భిందాల్చిన స్త్రీలను తొలి మాసాలలోనే గుర్తించి వారికి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించి ఎటువంటి రుగ్మతులను గురి కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే తల్లి ఆరోగ్యంతో పాటు పుట్టబోయే శిశువు ఆరోగ్య ఎదుగుదలకు దోహదపడుతుందన్నారు. చిన్నారులకు సకాలంలో రోగనిరోధక టీకాలను వేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
సమావేశంలో డియంహెచ్‌వో డా.యం సుహాసిని, డిసిహెచ్‌ఎస్‌ డా. స్వప్న డిప్యూటి డియంహెచ్‌వో డా. నళినిదేవి, డిఐవో అమృతం, పిహెచ్‌సి వైద్యులు డా. పద్మావతి, డా. దివిజ, పిహెచ్‌సి వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *