ముఖ్యమంత్రి ఆదేశాలతో కృష్ణవేణి విగ్రహం మహానాశికం కలశం లకు నూతన సొభగులతో పూర్వ వైభవం.

-జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సూచనలతో ప్రకాశం బ్యారేజ్ వద్ద గల కృష్ణవేణి మాత విగ్రహానికి మహానాశికం పట్టీలు కలశం లకు మరమ్మత్తులు చేసి సొభగులతో పూర్వ వైభవాన్ని తీసుకురానున్నట్లు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు.
కృష్ణవేణి విగ్రహం మహానాశికం మరమ్మత్తులపై బుధవారం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు కనకదుర్గ అమ్మవారి దేవస్థానం అధికారులతో కలిసి కృష్ణవేణి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి ఇటీవల గొల్లపూడి పర్యటనకు వచ్చి వెళ్లిన సమయంలో ప్రకాశం బ్యారేజి వద్ద గల కృష్ణవేణి విగ్రహాం పరిసర ప్రాంతాలను ఇంద్రకీలాద్రి పై నిర్మించిన చైనా వాలును పరిశీలించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి పరిశీలనలో కృష్ణవేణి విగ్రహం మహానాశకం కలశంలు కళా హీనంగా ఉండటాన్ని గమనించి వెంటనే వాటికీ మరమ్మత్తులు నిర్వహించి పూర్వ వైభవాన్ని ఆదేశించారన్నారు. 1992 పుష్కరాల సందర్బంగా 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన కృష్ణవేణి విగ్రహం పరిసర ప్రాంతాల కట్టడాలు ఇప్పటివరకు ఎటువంటి మరమ్మత్తులు జరగకపోవడం రంగులు వెలిసిపోవడంతో కళా విహీనంగా మారాయన్నారు. ముఖ్యమంత్రి వర్యులే స్వయంగా పరిశీలించి పూర్వ వైభవం తీసుకురావాలని ఆదేశించడం సంతోషదాయకమన్నారు . ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శిల్ప కళలో ప్రావీణ్యత గల శిల్పుల పర్యవేక్షణలో కనకదుర్గమ్మ దేవస్థానానికి సంభందించి సుమారు 5 లక్షల రూపాయల నిధులతో కృష్ణవేణి విగ్రహాం మహానాశకం కలశం పట్టీలు హంసలకు మరమ్మత్తులు నిర్వహించి రంగులతో తీర్చి దిద్ది సందర్శకులను, భక్తులను ఆకర్షించే విధంగా పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని సాధ్యమైనంత త్వరలో పనులు పూర్తీ చేయాలనీ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరును ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనితోపాటు ముఖ్యమంత్రి సూచనల మేరకు ఇంద్రకీలాద్రిపై నిర్మించిన చైనా వాల్ పటిష్టతపై సంబందిత అధికారులను సంప్రదించడం జరిగిందని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో చైనా వాల్ నిర్మాణం జరిగినట్లు తెలిపారని అయినప్పటికీ మరొకసారి నిపుణులతో పరిశీలించి ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు వివరించారు .
కృష్ణవేణి విగ్రహం పరిసర ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంట శ్రీ దుర్గ మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు డి. భ్రమరాంభ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు ఎల్. రామ , ప్రకాశం బ్యారేజి జె .ఇ. వి. దినేష్ , లాక్ సూపరింటెండెంట్ , ఎ. సత్తార్ , తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *