స్టేజ్ కన్వర్షన్ కోసం నిర్దేశించిన లక్ష్యాలను నూరు శాతం సాధించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉగాది నాటికి నిర్దేశించిన ఇంటి నిర్మాణ పనుల్లో స్టేజ్ కన్వర్షన్ పై ప్రత్యేక కార్యాచరణ అత్యంత పక్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. గురువారం వెలపూడిలోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి హౌసింగ్, రీ సర్వే, రెవెన్యూ, స్పందన, వ్యవసాయ అనుబంధ శాఖల, పంచాయతీ రాజ్ శాఖ లు ద్వారా చేపట్టి అమలు చేస్తున్న లక్ష్యాల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.   స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్, ఇతర అధికారులు హాజరయ్యారు. సిఎస్ కే ఎస్ జవహర్ రెడ్డి జిల్లాలకు కేటాయించిన హౌసింగ్ నిర్మాణ పనులు, స్టేజ్ కన్వర్షన్ కోసం నిర్దేశించిన లక్ష్యాలను నూరు శాతం సాధించాల్సి ఉంటుందని ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలోఉగాది నాటికి 18273 ఇళ్ళ నిర్మాణం లక్ష్యం కాగా 14148 పూర్తి చేసి, స్టేజ్ కన్వర్షన్ కు దశల వారీగా ప్రాధాన్యత ఇస్తూ, మండల వారీగా ప్రతిరోజూ హౌసింగ్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తక్కువ ప్రగతి దిశగా అడుగులు వేస్తున్న మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతున్నట్లు తెలియచేశారు. సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ (సీఎస్ఎమ్సి) 63,64 లకు చెంది 6212 కిగాను 5807 మ్యాపింగ్ చేసి, 5748 గ్రౌండింగ్ చేసినట్లు తెలిపారు. 65 వ సిఎస్ఎమ్ సి కింద 11,300 ప్రతిపాదించి, వాటికి డాక్యుమెంటేషన్ వివరాలు అప్లోడ్ చేసినట్లు తెలిపారు. హౌసింగ్ నిర్మాణాలకు సంబంధించి నిధుల విడుదల నేపథ్యంలో మరింత వేగవంతం చేయాలని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జిల్లాలో  రీ సర్వే కి సంబంధించి వివిధ దశల్లో నిర్దేశించిన లక్ష్యాలను రానున్న 48 గంటల్లో పూర్తి చెయ్యాలని ఆదేశించారు. మిగతా జిల్లాల పురోగతి లక్ష్యాలను సాధించడానికి అవసరమైన చర్యలు తీసుకోగా, తక్కువ లక్ష్యాల పట్ల అలక్ష్యం చూపవద్దని ఆదేశించారు.  వచ్చే సమీక్ష నాటికి నూరు శాతం పూర్తి చెయ్యాలని పేర్కొన్నారు. జిల్లాకు తక్కువ లక్ష్యాలను నిర్దేశించినా, ఆ మేరకు పనుల్లో జాప్యం తగదన్నారు.

గ్రామాలకు గాను డ్రోన్ ఫ్లేయింగ్, గ్రౌండ్ ట్రూథింగ్ (జిటి), జీ టి నోటీస్ నూరుశాతం అంద చేయాలన్నారు. జిటి నోటీస్ లకు చెంది 16 గ్రామాలకు గాను 14 గ్రామాల్లో నోటీస్ ఇవ్వడం జరిగిందని, మిగిలిన రెండు గ్రామాల్లో నోటీస్ జారీ చేయాలన్నారు. అందుకు అనుగుణంగా సర్వే ప్రక్రియ పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయి పర్యటన చేసి దిశా నిర్దేశం చేస్తున్నట్లు తెలిపారు. రానున్న దశల్లో ఎక్కువ లక్ష్యాలను సాధించాల్సి ఉన్నందున ఇప్పటి నుంచి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలన్నారు. తుది పి ఓ ఎల్ ఆర్ వివరాలు ఆన్లైన్ లో అప్లోడ్ చేసి, వాటి ప్రగతి ఆన్లైన్ లో చూపాలని స్పష్టం చేశారు. స్పందన కి చెంది 4,493 అర్జీలకు గాను 4261 సమాధానాలు ఇవ్వడం జరిగిందని, 232 పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెండింగ్ అర్జిలకు చెంది రాండమ్ గా ఆయా అర్జిదారిని, సంబంధించిన సచివాలయ సిబ్బందిని పిలిపించి సమగ్రంగా అధ్యయనం చేసే విధానం చేపట్టనున్నట్లు మాధవీలత తెలిపారు.

వ్యవసాయ అనుబంధ అంశాలకు సంబంధించి జిల్లాలో 183415 ఎకరాలకు గాను నూరుశాతం ఈ క్రాప్ నమోదు చేయాలనే లక్ష్యం కాగా వాటిలో 1,78,836 ఎకరాల్లో ఈ క్రాప్ నమోదుతో 97 శాతం డేటా ఈ కేవైసి పూర్తి చేసినట్లు మాధవీలత తెలిపారు. వై యస్ ఆర్ యంత్ర సేవా పథకం కింద 173 అర్భికే లకు గాను 155 గ్రూప్స్ ఏర్పాటు చేసి, 45 గ్రూప్ లకు చెంది బ్యాంకు రుణాల మంజూరు కోసం ప్రతిపాదనకు ఆమోదం పొందడం జరిగిందన్నారు. జగనన్న పాల వెల్లువ, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ పురోగతి వేగవంతం చేస్తున్నామన్నారు. అమృత్ సరోవర్ కింద 80 పనులను చేపట్టి, అన్ని పుతిగతిలో ఉన్నాయని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద 59 లక్షల పని దినాలకు గానూ 48.53 లక్షల దినాలు సాధించడం జరిగిందని మాధవీలత తెలిపారు. 390 గ్రామ సచివాలయ భవనాలలో 318 భవనాలు పూర్తి అవ్వగా, మరో 38 తుది దశకు చేరుకున్నాయ న్నారు. 373 అర్భికెలలో 255 పూర్తి అవ్వగా, మరో 42 దాదాపు పూర్తి చేసి నట్లు పేర్కొన్నారు. వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్స్ 337 లో 185 పూర్తి చేసినట్లు తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్వో  జి. నరశింహు లు, ఆర్డీవో లు  ఏ. చైత్ర వర్షిణి, ఎస్.మల్లి బాబు, జిల్లా హౌసింగ్ అధికారి జీ. పరశురామ్, జిల్లా సంవర్ధక శాఖ అధికారి ఎస్ జీ టి సత్యగోవింద్, డిపిఓ పి.జగదంబ, డ్వామా పీడి జిఎస్ రామగోపాల్,  ఆర్డబ్యూ ఎస్. ఈ డి.బాలశంకర్ రావు, పంచాయతీ రాజ్ ఎస్ ఈ ఏవిబి ప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారి ఎస్. మాధవరావు,  డి హెచ్ వో వి. రాధాకృష్ణ, జిల్లా సర్వే అధికారి పి. లక్ష్మణ రావు, డి ఎల్ డివో పి. వీణా దేవి, కే. శాంత మణి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *