రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఈ రోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి పట్టణంలోని పలు సంక్షేమ వసతి గృహాలను గురువారం సందర్శించారు. మొదట కె.వి.స్టేట్ హోమ్ ని సందర్శించి అక్కడ వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్ధినులతో మాట్లాడారు. వారికి వసతి గృహంలో ఎలాంటి సమస్యలున్నా తెలియజేయాలని అన్నారు. వారికి మంచి పౌష్టికాహారాన్ని అందించాలని, వారికి అందించాల్సిన సౌకర్యాలలో ఎటువంటి లోటు పాట్లు ఉండకూడదని వసతి గృహ సిబ్బందికి సూచించారు. తరువాత ప్రభుత్వ బాల సదనమును సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ సమయానికి మంచి ఆహారాన్ని అందించాలని అన్నారు. పిల్లలతో కాసేపు మాట్లాడారు. అనారోగ్యాల బారిన పడకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని సందర్శించి, వసతులను పరిశీలించారు. పిల్లలకు ఎలాంటి ఆహారాన్ని అందిస్తున్నారని అక్కడి సిబ్బందిని, పిల్లలను అడిగి తెలుసుకున్నారు.
Prajavartha Online Telugu News