ఉద్యోగమేళా…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టరేట్ లో వికాస వారి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యోగమేళాలో 16 మంది నిరుద్యోగ యువత వివిధ కంపెనీల్లో ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ కె. మాధవీలత తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్ లోని వికాస్ కేంద్రంలో ఇంటర్వూలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రతి శనివారం జిల్లా కలెక్టర్ లోని వికాస్ కేంద్రం లో బహుళజాతి, స్థానిక ప్రవేటు సంస్థల అధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూ లను నిర్వహించడం జరుగు తుందన్నారు. ఆసక్తి గల యువత మరింత సమాచారం కోసం తూర్పు గోదావరీ జిల్లా వికాస్ కేంద్రం కు జిల్లా రిసోర్స్ పర్సన్ చెందిన సత్యనారాయణ ను మరింత సమాచారం కోసం ఫోన్ నంబర్ +918309010013 ను సంప్రదించగలరని తెలియజేశారు. జిల్లాలో ఎక్కడెక్కడ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు అనే సమాచారం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జాబ్స్ ఎంపికైన వారిని కలెక్టర్ అభినందించారు. శనివారం జరిగిన జాబ్ మేళాకు 48 మంది హాజరయ్యారని , వారిలో 16 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పొందడం జరిగిందని సత్యనారాయణ తెలిపారు. ఇసుజు మోటార్స్ ఒకరు, ఇఫ్కో-టోకియో జనరల్ ఇన్సూరెన్స్ ముగ్గురు, స్టార్ పవర్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ 12 మంది ఎంపిక అయ్యారని తెలిపారు. వికాస మేనేజర్ సత్యనారాయణ , ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *