“అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు”

కోరుకొండ/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగా “అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు” ను పురస్కరించుకుని మార్చి 4 నుండి 11 వరకు నిర్వహించ బడుచున్న న్యాయ అవగాహన కార్యక్రమములలో భాగంగా శనివారం తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించినారు. ఈ సదస్సులో మహిళలతో ప్రత్యూష కుమారి మాట్లాడుతూ వారికి ఏవిధమైన న్యాయ పరమైన సమస్యలున్నా స్థానిక కోర్టులలో గల మండల న్యాయ సేవాధికార కమీటీని గాని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థను గాని సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. మహిళలకి కల్పించబడిన న్యాయపరమైన చట్టాలు మరియు రాజ్యంగపరమైన హక్కుల్ని వారికీ తెలియజేశారు. ఇందులో భాగంగా మహిళల సామజిక మరియు ఆర్దిక అభివృద్ధి కోసం రూపొందించబడిన నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990, గృహ హింస నిరోధకచట్టం, వరకట్న నిషేధ చట్టం మరియు ఆస్తి హక్కు చట్టo మొదలగు చట్టాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి వి.వి.వి.ఎస్.ఎస్. కుమారి, మండల సమాఖ్య ప్రెసిడెంట్ జి.మానస, డి. ఆర్. డి. ఎ. అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇ. శ్యామ సుందర్, ప్యానల్ అడ్వకేట్ డీ.వెంకటేశ్వర రావు, పారా లీగల్ వాలoటీర్ ఇ. రాధాకుమారి పాల్గొని మహిళలకు హక్కుల పట్ల అవగాహన కల్పించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *