తిరుపతి, మార్చి 06:
తిరుపతి జిల్లాలో నాలుగు డివిజన్ లకు సంబంధించి డివిజన్ కేంద్రాలలో పోలింగ్ మెటీరియల్ తరలింపుకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ నెల 12 న పి.ఓ., ఎ.పి.ఓ. లకు చెక్ లిస్టు మేరకు జాగ్రత్తగా పంపిణీ జరగాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. సోమవారం మద్యాహ్నం స్థానిక శ్రీ పద్మావతీ డిగ్రీ కళాశాల పి జి బ్లాక్ లో ఏర్పాటు చేస్తున్న తిరుపతి డివిజన్ డిస్ట్రిబ్యూషన్ , రిసెప్షన్ సెంటర్ ను జిల్లా కలెక్టర్, నగరపాలక కమీషనర్ అనుపమ అంజలి, ఆర్.డి.ఓ. కనకనరసా రెడ్డి మరోసారి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పి.ఓ. లు, ఎ.పి.ఓ. లు పోలింగ్ కేంద్రాల విధులు అందుకున్న వారు తప్పనిసరి ఈ నెల 12 న ఉదయం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద పోలింగ్ కు సంబందించిన మార్క్ డ్ ఓటర్ లిస్టు, పోలింగ్ బాక్సులు , బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ ఇతర సామగ్రిని ఒకటికి రెండుసార్లు పరిశీలించి సరిచూసుకుని తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. పోలింగ్ మెటీరియల్ తీసుకున్న అనంతరం తప్పనిసరిగా డిస్ట్రిబ్యూషన్ కం రిసెప్షన్ సెంటర్లో శిక్షణకు హాజరై సందేహాలను నివృత్తి చేసుకొని కేటాయించిన బస్సు రూట్ లలో బందోబస్తుతో ప్రయాణించి పోలింగ్ కేంద్రాలను చేరుకోవాల్సి ఉంటుందని అన్నారు.
తేది 13 న పోలింగ్ సందర్భంగా కేంద్రాల్లో వసతుల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని, ఓటరు స్లీప్ ల పంపిణీ 50 శాతం మేరకు జరిగిందని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. తిరుపతి డివిజన్ కు సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గ పోలింగ్ కేంద్రాలు 29, ఓటర్లు 37,899, ఉపాధ్యాయ నియోజకవర్గ పోలింగ్ కేంద్రాలు 12, ఓటర్లు 3083 గా ఉన్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ పర్యటనలో అర్బన్ తహశీల్దార్ మరియు ఎ.ఈ.ఆర్.ఓ. వెంకటరమణ, నగరపాలక డిప్యూటి కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి , మునిసిపల్ ఇంజనీర్లు ఎలక్షన్ డి.టి. జీవన్ , ఏ ఎస్ ఓ మధు, డీటీలు రామచంద్ర , జానీతదితరులు పాల్గొన్నారు.
తిరుపతి డివిజన్ పట్టభద్రుల నియోజకవర్గ పోలింగ్ కేంద్రాలు :
209- జడ్పీ హెచ్ ఎస్, ఎర్రావారిపాలెం, 210 – జడ్పీ హెచ్ ఎస్, చిన్నగొట్టిగల్లు, 211- ఎన్.వి.ఎన్ స్కూల్, పాకాల, 212, 213 – ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, చంద్రగిరి, 214, 215 – జడ్పీ హై స్కూల్, తిరుచానూరు, 216, 217 – జడ్పీ హై స్కూల్, పద్మావతీ పురం, 218- జడ్పీ హైస్కూల్, ఆర్.సి.పురం, 219- ఎస్.వి. హై స్కూల్, తిరుపతి , 220- ఎం.పి.పి స్కూల్ ఎం.ఆర్.పల్లి, 221 – ఎం.సి. ప్రైమరీ స్కూల్, సరోజినీ దేవి రోడ్, తిరుపతి, 222, 226- ఎస్.జి.ఎస్. హైస్కూల్, కె.టి. రోడ్, తిరుపతి, 223- టి.పి.పి.ఎం. స్కూల్ , టి.పి. ఏరియా, తిరుపతి – 224- శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి, 225- ఎం.జి.ఎం హైస్కూల్, బైరాగిపట్టెడ, తిరుపతి, 227- బి.ఆర్.అంబేద్కర్ మున్సిపల్ స్కూల్, ఎస్.టి.వి. నగర్, తిరుపతి, 228- మున్సిపల్ స్కూల్, సంజయ్ గాంధీ కాలనీ, తిరుపతి, 229- ప్రభుత్వ బాలికల పాఠశాల చిన్నబజారు వీధి, తిరుపతి, -230 మున్సిపల్ స్కూల్, దొడ్డాపురం వీధి, తిరుపతి, 231- ఎస్.జి.ఎస్. ఆర్ట్స్ కళాశాల, తిరుపతి, 232 – మున్సిపల్ స్కూల్ మాలవ్యాగి వీధి, తిరుపతి, 233, 234- జడ్పీ హైస్కూల్ సత్యనారాయణ పురం, తిరుపతి, 258 జడ్పీ హైస్కూల్, వడమాలపేట, 259,260 – ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పుత్తూరు.
తిరుపతి డివిజన్ ఉపాధ్యాయ నియోజకవర్గ పోలింగ్ కేంద్రాలు :
107- జడ్పీ హైస్కూల్ , ఎర్రావారిపాలెం, 108 – జడ్పీ హైస్కూల్ చిన్నగొట్టిగల్లు, 109- ఎన్.వి.ఎన్. ఇంగ్లిష్ మీడియం స్కూల్ , పాకాల, 110 – ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చంద్రగిరి, 111- గ్రామపంచాయితీ కార్యాలయం కొత్త భవనం, తిరుచానూరు – 112 – జడ్పీ హై స్కూల్, ఆర్.సి.పురం, 113, 114 – ఎస్.వి.హై స్కూల్ పెద్దపీర్ల చావిడి వీధి, తిరుపతి, 115 – డా. డి.రామానాయుడు ఎం.సి. ప్రాథమిక పాఠశాల, బైరాగిపట్టెడ, తిరుపతి, 116 – ఎం.సి ప్రాథమిక పాఠశాల , దొడ్డాపురం వీధి, తిరుపతి, 134- జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, వడమాలపేట, 135 – ప్రభుత్వ డిగ్రీ కళాశాల , పుత్తూరు.
Prajavartha Online Telugu News