Breaking News

ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా సహస్ర చండీ యాగం బ్రోచర్ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని శ్రీ దేవి కరుమారి అమ్మన్ శక్తి పీఠం సభ్యులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు శివశక్తి నగర్లోని పీఠం నందు జరిగే సహస్ర చండీ యాగానికి విచ్చేయవలసిందిగా కోరారు. ఈ మేరకు ఆంధ్రప్రభకాలనీలోని జనహిత సదనములో ఆహ్వానపత్రికను అందజేయగా.. తప్పక హాజరవుతానని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మల్లాది విష్ణుని దుశ్శాలువతో ఘనంగా సత్కరించి కరుమారి అమ్మన్ జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే చేతులమీదుగా సహస్ర చండీ యాగ పూర్వక మహా కుంభాభిషేక బ్రోచర్ ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమంలో శక్తి పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు, అమ్మవారి ట్రస్ట్ కోశాధికారి జ్ఞానేశ్వర్, నవ్యాంధ్ర రచయితల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి యేమినేని వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *