పోటీలో పాత్రికేయుడు…

విజయనగరం/బొబ్బిలి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తరాంధ్ర పట్టబద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో, విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన పాత్రికేయుడు ( ప్రెస్ రిపోర్టర్) పొట్నూరు కిరణ్ కుమార్ (రాజ్ కిరణ్) స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నట్లు మీడియాకు తెలియజేశారు. మీడియా మిత్రుల ఆశీస్సులతో, బహుజనుల ( ఎస్సీఎస్టీ, బీసీ & మైనారిటీస్ ..) ఆదరాభిమానాలతో, పోటీలో ఉన్నట్లు తెలియజేశారు. ఇతని క్వాలిఫికేషన్ (ఎం.ఎస్సీ ), బి .ఎస్సీ , బి .ఈడి , పీజీడీసీఎ..రాజ్ కిరణ్ ఏపీ & టిఎస్ మీడియా హబ్ ద్వారా, అనేక ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ కు ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తూ, డిజిటల్ మీడియా ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూ, అనంతకాలంలోనే మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి ఇతను.మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈయన, 15 సంవత్సరాలపాటు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసి, ఆ తరువాత మీడియా రంగంలోనికి రావడం జరిగింది. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బొబ్బిలి తారకరామా కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈనెల 13న జరగబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈయన ఎంత మేరకు విజయవంతం అవుతారో అందరూ వేచి చూడాల్సిందే.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *