విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పిసిసిఎం) జి. జాన్ ప్రసాద్ రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (ఆర్ సి టి) అమరావతి బెంచ్‌లో టెక్నికల్ మెంబర్‌గా ఎంపికయ్యారు. జూన్ 2019 నుండి పిసిసిఎం గా జి. జాన్ ప్రసాద్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐ ఆర్ టి ఎస్ ) 1986 బ్యాచ్‌కి చెందిన అధికారి . దక్షిణ మధ్య రైల్వేలో పిసిసిఎంగా బాధ్యతలు స్వీకరించడానికంటే ముందు కర్ణాటకలోని హుబ్బలీ లోని నైరుతి రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేసారు. జి. జాన్ ప్రసాద్ రైల్వేలో వాణిజ్య, కార్యకలాపాలు మరియు క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లలో అపారమైన అనుభవము గల అధికారిగా గుర్తింపు పొందారు . ఇటీవలి కాలంలో దక్షిణ మధ్య రైల్వేలో అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ విధానంలో డిజిటలైజేషన్ చేసే ప్రక్రియలో విశేషంగా సహకరించారు.
Prajavartha Online Telugu News