Breaking News

ముగిసిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి ఉషాసలై స్కూల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ లోకల్ రిసోర్స్ పర్సన్ లకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమాలు స్థానిక వాసవ్య మహిళా మండలిలో ముగిశాయి. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈ తరగతులు శుక్రవారం, శనివారం జరిగాయని ఇందులో తెలంగాణా నుండి ముగ్గురు ఆంధ్రప్రదేశ్ నుండి ఇద్దరు ట్రైనీస్ పాల్గొన్నారని వీరు ఇక్కడ నేర్చుకున్న అంశాలైన కుట్టు లో మెలకువలు, సాంకేతికతను వారి జిల్లాలలోని మహిళలకు శిక్షణ ఇస్తారని ఆయన అన్నారు. గత మూడు సంవత్సరాల నుండి ఉష కంపెణి వారు గ్రామీణ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కుట్టు శిక్షణా కార్యక్రమాలు, మిషన్ మరమత్తుల ను నేర్పించి ఉచితంగా ఉషా కుట్టు మిషన్లను అందజేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కె.శివయ్య, టి. లావణ్య, జానకి, క్రిష్ణ కుమరి, సునీత, బుజ్జి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *