రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నిత్య విద్యార్థిగా మనదైన పనితనం చూపితే తప్పకుండా మన ప్రతిభకు గుర్తింపు తార్కాణం గా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ ఛాంబర్ లో అవార్డ్ వివరాలు కలెక్టర్ తెలియచేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, తూర్పుగోదావరి జిల్లా యూనిట్ జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ను అభినందించారు. ఇటీవల ముస్సోరి లో గల “లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నందు ట్రైనింగ్ పొంది , సదరు ట్రైనింగ్ నందు 139 మంది ఇతర అధికారులతో పోటీ పడి వ్రాత పరీక్ష నందు మొదటి స్థానం , అలాగే భారత్ దర్శనం గ్రూప్ విభాగంలో కూడా మొదటి స్థానం సాధించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ . తేజ్ భరత్ ను జిల్లా కలెక్టర్ వారి సమక్షంలో రెవెన్యూ ఉద్యోగులు తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలిపినారు.. హాజరు అయిన వారిలో, APRSA జిల్లా అధ్యక్షులు గొలుగూరి బాపిరాజు, గౌరవ అధ్యక్షులు మక్సూద్ ఆలీ, కలెక్టర్ ఆఫీస్ యూనిట్ సెక్రటరీ కంఠం ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ రామారావు, సీసీలు గోపీచంద్, నాగేంద్ర ఇతర సభ్యులు హాజరు అయినారు.
Prajavartha Online Telugu News