-డి ఆర్వో జీ. నరసింహం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా శాఖను మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని జిల్లా రెవిన్యూ అధికారి జి. నర్సింహులు పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలమేరకు జిల్లా కలెక్టరేట్ లోని రెడ్ క్రాస్ మ్యానేజింగ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్వో జి. నరసింహం మాట్లాడుతూ, రెడ్ క్రాస్ ను మరింత బలోపేతం చేయాలని, ఆ మేరకు ఏప్రిల్ 6న జిల్లా మేనేజింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని సమావేశంలో తీర్మానించామన్నారు. జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ యొక్క కార్యక్రమాలకు జిల్లా అధికారుల నుండి పూర్తి సహకారం అందించే విధంగా చర్యలు చేపడతా మన్నారు. ఆమేరకు మేనేజింగ్ కమిటీ సభ్యులకు డిఆర్వో నర్సింహులు పలు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ వై. మధుసూదన్ రెడ్డి, కార్యదర్శి జక్కంపూడి విజయలక్ష్మి, వైస్ చైర్మన్ దాల్ సింగ్, సభ్యులు గొట్టిముక్కల అనంతరావు, నరేష్ రాజు, సత్యనారాయణ, కె.వి. రమణ, మహాలక్ష్మి ఇతర సభ్యులు, సిబ్బంది పాల్గొని సంస్థ కార్యకలాపాల విషయమై చర్చించారు.
అనంతరం డిఆర్వో నర్సింహులును ఎంసీ సభ్యులు సత్కరించడం జరిగింది.
Prajavartha Online Telugu News